Kid Video Viral: చిన్న పిల్లలను బడికి పంపడం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్. కొంతమంది పిల్లలు బడికి వెళ్ళడానికి టైం కంటే ముందే రెడీ అయితే.. మరికొందరు.. స్కూల్ కు వెళ్ళడానికి ఓ రేంజ్ లో డ్రామా ప్లే చేస్తారు. ముఖ్యంగా సెలవుల తర్వాత స్కూల్ కు పిల్లలని పంపించాలంటే.. ఆ తల్లిదండ్రుల సహనానికి పరీక్షనే. కొందరు పిల్లలు తమను ఎవరూ బలవంతంగా స్కూల్ వ్యాన్‌లో (School Van) కూర్చోబెట్టలేని విధంగా చేతులు, కాళ్లు కదుపుతూ.. నానా హంగామా చేస్తారు. అయినప్పటికీ తల్లి తన పిల్లవాడు ఎంత అల్లరి చేసినా సరే, అతనికి ప్రాథమిక విద్యను అందించడానికి తన ప్రయత్నాన్ని మానదు. చివరి తన పిల్లాడిని స్కూలుకు ఏ విధంగానైనా తీసుకుని వెళ్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ( Viral Video ). పిల్లవాడు పాఠశాలకు వెళ్లడానికి మారాం చేస్తున్నాడు. అతని తల్లి అతని చేతులు కాళ్ళు కట్టివేసి ఓ రేంజ్ లో పాఠశాలకు తీసుకుని వెళ్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా తమ బాల్యం గుర్తుకు వస్తుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము
వైరల్‌గా మారిన వీడియోలో, ఒక మహిళ తన బిడ్డను చేతులు, కాళ్ళకు బంధించి.. పాఠశాలకు తీసుకెళుతున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు. స్కూల్ యూనిఫాంలో ఉన్న మరికొంతమంది విద్యార్థులు ఆ తల్లికి సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలుడు తాను పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గట్టిగా కేకలు వేస్తున్నాడు. అయినప్పటికీ ఆ తల్లి తన బిడ్డ మాటలను లెక్క చేయకుండా ఎంత ఏడుస్తున్నా సరే.. మరో ముగ్గురు స్టూడెంట్స్ సాయంతో కాళ్ళు చేతులు పట్టుకుని తన పిల్లాడిని స్కూల్ లోకి తీసుకెళ్లిన తర్వాతే ఊపిరి పీల్చుకుంది.
పాఠశాలకు వెళ్తున్న చిన్నారి వీడియో
Don’t forget the efforts taken by your parents and friends to get you good education pic.twitter.com/NuzHtNBziK
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) April 27, 2022
కేవలం 20 సెకన్ల ఈ వీడియోను ఐఎఫ్ఎస్ డాక్టర్ సామ్రాట్ గౌడ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘నీకు మంచి విద్యను అందించడానికి మీ తల్లిదండ్రులు , స్నేహితులు చేసిన ప్రయత్నాలను మర్చిపోవద్దు’ అని అతను క్యాప్షన్‌లో రాశారు. ఒక రోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 1 లక్షకు పైగా వీక్షించారు. అదే సమయంలో, పోస్ట్‌ను 8 వేల మందికి పైగా లైక్ చేసారు. వెయ్యి మందికి పైగా రీట్వీట్ చేశారు. ఈ వీడియో ను చూస్తుంటే ..ఖచ్చితంగా నా బాల్యం గుర్తుకొస్తుంది.. ఆ సీన్ ను ఇప్పటికీ మరచిపోలేనని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు.. ఈ వీడియో ద్వారా మా బాల్యాన్ని మరోసారి మా ముందుకు తీసుకొచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎంత అందమైన బాల్యం అని ఇలా చాలా మంది తమ బాల్యంలో స్కూల్ డేస్ ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
Also Read: May flower: ముందే పూచిన మే ఫ్లవర్..! వీటిని మీరు ఎప్పుడైనా చూశారా..?