చరణ్ కోసం ట్రై చేస్తే, చిరు చిక్కాడు..ఆ దర్శకుడి లక్ మాములుగా లేదుగా !

ఎందుకో, ఏంటో తెలియదు కానీ, ఈ మధ్య  చిరంజీవి సినిమాల విషయంలో బాగా జాప్యం జరుగుతోంది. ఎప్పుడో మొదలెట్టిన 'ఆచార్య' ఇంతవరకు పూర్తవ్వలేదు.

  • Ram Naramaneni
  • Publish Date - 5:44 pm, Sat, 21 November 20
చరణ్ కోసం ట్రై చేస్తే, చిరు  చిక్కాడు..ఆ దర్శకుడి లక్ మాములుగా లేదుగా  !

ఎందుకో, ఏంటో తెలియదు కానీ, ఈ మధ్య  చిరంజీవి సినిమాల విషయంలో బాగా జాప్యం జరుగుతోంది. ఎప్పుడో మొదలెట్టిన ‘ఆచార్య’ ఇంతవరకు పూర్తవ్వలేదు. మరోవైపు  ‘లూసిఫర్’ రీమేక్ డైరెక్టర్ విషయం తేలడం లేదు. తొలుత అనుకున్న సుజీత్ పక్కకు తప్పుకోవడంతో ఆ ప్లేసులోకి సీనియర్ దర్శకుడు వివి వినాయక్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన పేరు కూడా సైడయ్యింది. రామ్ చరణ్ తో సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్న దర్శకుడు మోహన్‌రాజాకు చిరంజీవి కొత్త బాధ్యతల్ని అప్పజెప్పారని ప్రచారం జరుగుతోంది.

చిరుతో ‘లూసిఫర్‌’ రీమేక్‌ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఈయనకే లభించినట్టు ఫిల్మ్ నగర్ టాక్. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’ రీమేక్‌ హక్కుల్ని చరణ్ కోనుగోలు చేసి కూడా చాలా కాలమయ్యింది.‌ ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు కుదుటపడటంతో రీమేక్ పనులు  షురూ చేశారట. డైరెక్టర్‌గా మోహన్‌రాజాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

తెలుగు, తమిళ బాషల్లో పలు సక్సెస్‌ఫుల్  సినిమాలు చేశాారు  మోహన్‌. రామ్‌చరణ్‌కు విజయాన్ని అందించిన ‘ధృవ’ మాతృక ‘తని ఒరువన్‌’ తీసింది ఈయనే. తన కథలో చక్కగా ఒదిగిపోయిన రామ్‌చరణ్‌తో  ఓ డైరెక్ట్ తెలుగు సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలో ‘లూసిఫర్‌’ రీమేక్‌ అవకాశం ఆయన్ని వరించినట్టు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక ‘లూసిఫర్‌’ రీమేక్ ప్రారంభం కానుంది.

 

Also Read :

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం

ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్