లిప్ కిస్ అనుభవాన్ని చెబుతున్న ఐస్ క్రీం భామ.. పెళ్లి కాకుండా బాయ్‌ప్రెండ్‌ను మెయింటన్ చేయడంలో తప్పు లేదంటున్నతేజస్వి మడివాడ..
తొలిసారి లిప్ కిస్ అనుభవం ఎలా ఉందో చెప్పుకొచ్చింది ఐస్ క్రీం అమ్మడు తేజస్వి మడివాడ. గతంలో చాలా ఫేక్ కిస్‌లు పెట్టానని ఈసారి మాత్రం రియల్ కిస్ సీన్‌లో నటించానని ఓ ఇంటర్వూలో తెలిపింది.

తొలిసారి లిప్ కిస్ అనుభవం ఎలా ఉందో చెప్పుకొచ్చింది ఐస్ క్రీం అమ్మడు తేజస్వి మడివాడ. గతంలో చాలా ఫేక్ కిస్‌లు పెట్టానని ఈసారి మాత్రం రియల్ కిస్ సీన్‌లో నటించానని ఓ ఇంటర్వూలో తెలిపింది. అంతేకాకుండా ఆ కిస్ చేసిన వ్యక్తి నాకు తెలిసనవాడేనని చెబుతోంది ఈ అందాల భామ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, ఐస్‌క్రీం, కేరింత, లవర్స్ సినిమాలే కాకుండా చాలా సినిమాలలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది తేజస్వి. అయితే తాజాగా కమిట్ మెంట్ చిత్రం ద్వారా ప్రేక్షకుల మధ్యకు రానుంది. ఈ సినిమాలోనే హాట్ లుక్స్‌తో, బోల్ట్ లిప్ కిస్ సీన్లలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
అయితే తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నతేజస్వికి మొదటి పెళ్లిచూపులు రద్దయ్యాయి. దీంతో బాగా అప్సట్ అయి మళ్లీ సినిమాలలోకి వచ్చానని తెలిపింది. ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నానని, జీవితంలో ఇక పెళ్లి చేసుకోనని తెలిపింది. తాను సన్యాసిని కాదని పెళ్లికాకుండా బాయ్‌ఫ్రెండ్‌ను మెయింటన్ చేసుకోవచ్చని తన మనసులో మాట తెగేసి చెప్పింది. అంతేకాకుండా తాను గతంలో ఇద్దరితో పదేండ్లు డేటింగ్‌లో ఉన్నానని, ప్రస్తుతం ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని వెల్లడించింది. తాను చాలా మృదుస్వభావినని, ప్రస్తుతం చాలా పరిణితి సాధించానని చెప్పుకొచ్చింది ఈ భామ.