AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రామానికి చేరని ఉల్లి ఘాటు.. ఎందుకంటే..?

ఉల్లి కోయకుండా.. ఘాటు మండిపోతుంది. ఉల్లి ధరలను చూసి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం ఉల్లి కేజీ రూ. 100పైగా పలుకుతుండగా.. దాని ఘాటును తగ్గించి సబ్సిడీ మీద ఉల్లిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఆ వెరైటీ వింత తెలుసుకోవాలంటే  బీహార్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో ఉందీ త్రిలోకీబీగా అనే గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామానికి చెందిన ప్రజలు మాత్రం ఉల్లి రూ.500కు చేరినా.. తమకు ఎలాంటి […]

ఆ గ్రామానికి చేరని ఉల్లి ఘాటు.. ఎందుకంటే..?
Ravi Kiran
|

Updated on: Dec 05, 2019 | 2:28 PM

Share

ఉల్లి కోయకుండా.. ఘాటు మండిపోతుంది. ఉల్లి ధరలను చూసి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం ఉల్లి కేజీ రూ. 100పైగా పలుకుతుండగా.. దాని ఘాటును తగ్గించి సబ్సిడీ మీద ఉల్లిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజుల్లో ఆ వెరైటీ వింత తెలుసుకోవాలంటే  బీహార్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో ఉందీ త్రిలోకీబీగా అనే గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామానికి చెందిన ప్రజలు మాత్రం ఉల్లి రూ.500కు చేరినా.. తమకు ఎలాంటి దిగులు లేదని అంటున్నారు.

ఆ గ్రామ జనాభా సుమారు 400 మంది మాత్రమే. వాళ్ళందరూ కూడా కొన్ని ఏళ్ళ నుంచి ఉల్లి, వెల్లుల్లి తినరట. ఇలా తినకపోవడానికి కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది. ఆ ఊరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందని… ఆ వెంకన్నను కొలిచే గ్రామస్థులు ఉల్లి, వెల్లుల్లి తినడం మాత్రమే కాదు.. మద్యం కూడా ముట్టుకోరని సమాచారం. ఇక ఈ ఆచారం ఇప్పటిది కాదట.. దాదాపు శతాబ్దాల కిందట నుంచి ఆ గ్రామంలో కొనసాగుతోందని వినికిడి.

మరోవైపు ఉల్లి, వెల్లుల్లి తినాలని కొందరు ప్రయత్నించి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని సమాచారం. దీంతో ఎవరూ కూడా మళ్ళీ తినడానికి ధైర్యం చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ ఆచారాన్ని ఇప్పటికీ వారంతా పాటించడంతో.. ఉల్లి ఘాటు ఎంత ఉన్నా.. తమకు ఏమి కాదని చెబుతున్నారు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..