‘Master’ release date : ‘సంక్రాంతి బరిలోకి నేనూ వస్తున్నా’..రేస్‌లోకి దూసుకువచ్చిన ఇళయదళపతి విజయ్

|

Dec 29, 2020 | 3:08 PM

విజయ్ కూడా పొంగల్ బరిలోకి దిగిపోయాడు. కొద్ది సేపటి క్రితమే 'మాస్టర్' చిత్ర యూనిట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 

‘Master’ release date : సంక్రాంతి బరిలోకి నేనూ వస్తున్నా..రేస్‌లోకి దూసుకువచ్చిన ఇళయదళపతి విజయ్
Follow us on

‘Master’ release date :  విజయ్ కూడా పొంగల్ బరిలోకి దిగిపోయాడు. కొద్ది సేపటి క్రితమే ‘మాస్టర్’ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.  2021 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది టీమ్. మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో  విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో ఆండ్రియా జెరెమియా, రమ్య సుబ్రమణియన్, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్, నాసర్, ధీనా, సంజీవ్, శ్రీనాథ్, శ్రీమాన్, సునీల్ రెడ్డి కీలకపాత్రల్లో నటించారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 9 న విడుదల చేయాలని భావించారు.  కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికేట్ కూడా యూ/ఏ వచ్చింది. ఖైదీ ఫేమ్ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై మరింత బజ్ పెరిగింది. 

ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో విజయ్‌ జెడి అనే కళాశాల ప్రొఫెసర్‌గా, కాలేజీ విద్యార్థిగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. తమిళం‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా మాస్టర్ ఒకేసారి విడుదల అవుతుంది. చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందించారు. లెట్స్ సీ విజయ్ ఈ సంక్రాంతికి అభిమానులను ఏ రేంజ్‌లో ఇంప్రెస్ చేస్తాడో..!

Also Read : భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్.. హృద‌యానికి హద్దుకుంటోన్న ‘ఆహా’ సామ్‌జామ్ కొత్త ప్రోమో..