మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న రౌడీ హీరో.. సౌత్ ఇండియాలో ఆ ఘనత సాధించిన ఏకైక హీరో.

పెళ్లి చూపులు’ చిత్రంతో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అనంతరం వచ్చిన ‘అర్జున్ రెడ్డి’తో ఒక్కసారిగా సంచలనం సృష్టించాడీ క్రేజీ హీరో.

మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న రౌడీ హీరో.. సౌత్ ఇండియాలో ఆ ఘనత సాధించిన ఏకైక హీరో.

Updated on: Dec 24, 2020 | 12:59 PM

vijay devarakonda new record in instagram: ‘పెళ్లి చూపులు’ చిత్రంతో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అనంతరం వచ్చిన ‘అర్జున్ రెడ్డి’తో ఒక్కసారిగా సంచలనం సృష్టించాడీ క్రేజీ హీరో. ఈ సినిమా విజయంతో విజయ్ పేరు ఒక్కసారిగా అన్నీ ఇండస్ట్రీలో మారుమోగింది. దీంతో వరుస అవకాశాలు విజయ్ తలపు తట్టాయి. విజయ్ సినిమా వస్తుందంటే అటు బాలీవుడ్ నుంచి ఇటు కోలీవుడ్ వరకు ఆసక్తిగా చూస్తున్నారు.
ఇదిలా ఉంటే కేవలం సినిమాల్లోనే కాకుండా రౌడీ వియర్‌ పేరుతో వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేశాడీ హీరో. ఇక సోషల్ మీడియాలోనూ తన హవా కొనసాగిస్తోన్న ఈ యంగ్ సెన్సేషన్ తాజాగా అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. తాజాగా విజయ్ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 10 మిలియన్లు దాటింది. దీంతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో 10 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ రికార్డు క్రియేట్ చేశాడు. విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇక విజయ్ ప్రస్తుతం.. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.