టాలీవుడ్ న్యూమూవీ ‘విద్యార్థి’ టీజర్ రిలీజైంది. ‘ఎ లోన్ ఫైట్ ఫర్ లవ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ‘రాజుగారి గది’ ఫేమ్ చేతన్ చీను, టిక్‌టాక్ ఫేమ్ బన్నీ వాక్స్ (వర్షిణి) హీరో హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను దర్శకులు సురేందర్‌రెడ్డి, హరీష్ శంకర్.. నిర్మాతలు సాయి కొర్రపాటి, కె.ఎల్. దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. మహాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేటి రామకృష్ణ, వంశీ తాడికొండ, ఆళ్ల వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మధు మాదాసు రచన, దర్శకత్వం. టీజర్ విషయానికొస్తే.. ఉద్వేగ, ఉత్తేజ భరితమైన కథతో ఈ సినిమా నడుస్తుందని టీజర్ చెబుతోంది. హీరో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తుండగా, ‘మన జాతీయ గీతం మీద అంత గౌరవం ఉన్న మీకు మా జాతంటేనే ఎందుకు సార్ అంత కోపం’ అనే హీరో మాటలు సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తున్నాయి.
హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడాన్ని సహించలేని హీరోయిన్ ఫ్యామిలీ.. హీరోనీ, అతడి ఫ్రెండ్స్‌నీ హత్య చేయించడానికి ప్లాన్ చేస్తే.. హీరో ఒంటరిగా పోరాడాడనీ టీజర్ ద్వారా అర్థమవుతోంది. సినిమాలో 5 పాటలు, 6 ఫైట్లతో పాటు భారీ స్థాయిలో చిత్రీకరించిన కబడ్డీ ఎపిసోడ్ ఉన్నాయని చిత్ర యూనిట్ చెప్పింది. రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని.. గుంటూరు, రాజమండ్రి, వైజాగ్, అరకు వంటి లొకేషన్లలో 42 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ జరిపినట్లుగా వివరించింది.