‘ఎఫ్2’ సినిమాకి చాలా స్పెషల్ గౌరవం.. అదేంటంటే!!

| Edited By: Srinu

Oct 07, 2019 | 1:51 PM

‘ఎఫ్‌2’ గత ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్‌ అయిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్ హిట్ సాధించింది. సంక్రాంతి అల్లుళ్లుగా మంచి పేరు సంపాదించారు వెంకీ, వరుణ్‌లు. సాధారణ ఫ్యామిలీస్‌లో ఉండే గొడవలను.. గిల్లికజ్జాలను చాలా అద్భుతంగా తెరెక్కించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమాకి నిర్మాతగా.. దిల్‌రాజు వ్యవహరించారు. ఇక వెంకీ, వరుణ్‌, తమన్నా, మెహరిన్‌లు పాత్రల్లో జీవించారు. కాగా.. ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే.. ప్రతీయేటా.. గోవాలో నిర్వహించే అంతర్జాతీయ చలన […]

ఎఫ్2 సినిమాకి చాలా స్పెషల్ గౌరవం.. అదేంటంటే!!
Follow us on

‘ఎఫ్‌2’ గత ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్‌ అయిన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్ హిట్ సాధించింది. సంక్రాంతి అల్లుళ్లుగా మంచి పేరు సంపాదించారు వెంకీ, వరుణ్‌లు. సాధారణ ఫ్యామిలీస్‌లో ఉండే గొడవలను.. గిల్లికజ్జాలను చాలా అద్భుతంగా తెరెక్కించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమాకి నిర్మాతగా.. దిల్‌రాజు వ్యవహరించారు. ఇక వెంకీ, వరుణ్‌, తమన్నా, మెహరిన్‌లు పాత్రల్లో జీవించారు. కాగా.. ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే.. ప్రతీయేటా.. గోవాలో నిర్వహించే అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి.. ఈ ఏడాది తెలుగు నుంచి ఈ సినిమా ఎంపికయింది. ఈ విషయాన్ని ట్విట్టర్స్‌ ద్వారా డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలిపారు.

‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2019కి గాను తెలుగు నుంచి ‘ఎఫ్‌2 సినిమా’ ఎంపికవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. వేరే భాషా చిత్రాలతో మన తెలుగు సినిమా కూడా చిత్రోత్సవంలో సందడి చేయడమే బహుమతిగా మేము భావిస్తున్నామని.. చాలా ఆనందంగా ఉందని’ ట్వీట్‌లో పేర్కొన్నారు అనిల్ రావిపూడి.