వెంకటాపురం చెరువు ప్రాంత కష్టాలు..!

|

Oct 22, 2020 | 3:00 PM

భారీ వరదలు, వర్షాలకు పాతబస్తీ వాసులు ఇంకా కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ముంపు ముంగిట్లోనే అరిగోస పడుతున్నారు. ప్రధానంగా జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో సమీపంలో ఉన్న ఉస్మాన్‌నగర్‌, హబీబ్‌కాలనీలు నిండా మునిగాయి. 10 రోజులు అవుతున్నా ఇక్కడి వారి కష్టాలు తీరడం లేదు. వరదనీళ్లు పోయేందుకు దారి లేకపోవడంతో మోటార్లతో తోడుతున్నారు. 1200 కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. మరికొందరు తమ బంధువుల […]

వెంకటాపురం చెరువు ప్రాంత కష్టాలు..!
Follow us on

భారీ వరదలు, వర్షాలకు పాతబస్తీ వాసులు ఇంకా కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ముంపు ముంగిట్లోనే అరిగోస పడుతున్నారు. ప్రధానంగా జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో సమీపంలో ఉన్న ఉస్మాన్‌నగర్‌, హబీబ్‌కాలనీలు నిండా మునిగాయి. 10 రోజులు అవుతున్నా ఇక్కడి వారి కష్టాలు తీరడం లేదు. వరదనీళ్లు పోయేందుకు దారి లేకపోవడంతో మోటార్లతో తోడుతున్నారు. 1200 కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. మరికొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లారు. 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు నిండిపోయి మత్తడి పారుతోంది. వరదనీరు నిల్వ ఉండకుండా చేస్తే బాగుంటుందని వెంకటాపురం చెరువు ముంపు బాధితులు అంటున్నారు. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వాటర్‌లో తిరుగుతున్న క్రమంలో ఇన్ ఫెక్షన్‌ సోకుతున్నాయి. కాళ్ల దగ్గర పండ్ల మాదిరిగా అవుతుండడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అంటురోగాలు ప్రబలే ఆస్కారం ఉందన్న భయం ఇక్కడి వారిని వెంటాడుతోంది. అంతేకాదు.. తమను ఆదుకుని ముంపు నుంచి బయటపడేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఇంకో వారం రోజులు తోడితే కానీ నీళ్లు పోయే ఆస్కారం కనిపించడం లేదు. దాంతో నిలువ నీడ లేక, ఉపాధిలేక అవస్థలు పడుతున్నారు.