రోడ్డు ప్రమాదానికి గురైన పద్మశ్రీ వనజీవి రామయ్య

ఖమ్మం : పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం పట్టణంలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు ఆతన్ని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాప్పత్రికి తరలించారు. అనంతరం వనజీవి రామయ్య కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మొక్కల పెంపకం మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. తాను ఎక్కడికి వెళితే అక్కడ మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తుంటారు వనజీవి రామయ్య. పర్యావరణం కోసం వనజీవి […]

రోడ్డు ప్రమాదానికి గురైన పద్మశ్రీ వనజీవి రామయ్య

Edited By:

Updated on: Mar 30, 2019 | 6:53 PM

ఖమ్మం : పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం పట్టణంలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు ఆతన్ని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాప్పత్రికి తరలించారు. అనంతరం వనజీవి రామయ్య కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

మొక్కల పెంపకం మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. తాను ఎక్కడికి వెళితే అక్కడ మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తుంటారు వనజీవి రామయ్య. పర్యావరణం కోసం వనజీవి రామయ్య చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.