కార్మికులకు, చిరు ఉద్యోగులకు శుభవార్త.. తీర్థయాత్రలు చేసేందుకు ప్రభుత్వ సాయం.. ఆ రాష్ట్రం వారికి మాత్రమే..!

ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగుల‌‌ కోసం స్వామి వివేకానంద ఇతిహాసిక్ పర్యటన్ యాత్రా యోజన తీసుకొచ్చింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

కార్మికులకు, చిరు ఉద్యోగులకు శుభవార్త.. తీర్థయాత్రలు చేసేందుకు ప్రభుత్వ సాయం.. ఆ రాష్ట్రం వారికి మాత్రమే..!
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 01, 2021 | 2:21 PM

UP religious tour scheme: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సర్కార్ చిరు ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగుల‌‌ కోసం స్వామి వివేకానంద ఇతిహాసిక్ పర్యటన్ యాత్రా యోజన తీసుకొచ్చింది. ఈ నెల‌ 24న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ ప‌థ‌కానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర కార్మిక సంక్షేమ మండలిలో న‌మోదు చేసుకున్న 1.50కోట్ల మంది కార్మికులకు ఈ పథకం కింద ల‌బ్ధి చేకూర‌నుందని ఉత్తర‌ప్ర‌దేశ్‌ కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ సునీల్ భరాలా తెలిపారు. రాష్ట్రంలోని వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీలు, వర్క్ షాప్‌లలో పనిచేస్తున్న సిబ్బంది కోసం ప్రభుత్వం ఈ నూత‌న‌ పథకాన్ని తీసుకొచ్చింద‌ని చెప్పారు.

అయితే, ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రదేశాలకు మాత్రమే కార్మికులు, చిరుద్యోగులు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.12,000 చొప్పున‌ చెల్లించ‌నున్నట్లు సునీల్ భరాలా తెలిపారు. అయోధ్య, మథుర, ప్రయాగ్‌రాజ్, వారణాసి, హస్తినాపూర్, గోరఖ్‌నాథ్, శాకంబరీ దేవి దేవాలయం, వింధ్యవాసినీ దేవి దేవాలయం, ఆగ్రా వంటి ప్రదేశాలను యూపీ ప్రభుత్వం ఎంపిక‌చేసింది. వీటి సందర్శనకు వెళ్లే కార్మికులను, చిరు ఉద్యోగులను ప్రభుత్వమే ఎంపిక చేస్తుందని సునీల్ భరాలా వివరించారు.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!