Viral Video: అత్తారింటికి దారిదా?.. రోడ్డులేక పెళ్లి డ్రస్‌లోనే 18 కి.మీ నడిచి వెళ్లిన నవవధువు!
స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 79 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ మన దేశంలోని కొన్ని మారుమూల గ్రామాలు అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలకు సరైన రోడ్డు మార్గులు కూడా లేవు.. తాజాగా వివాహ వేడుక ముగిశాక అత్తగారింట్లో అడుగుపెట్టాల్సిన ఓ నవవధువుకు ఎదురైన అనుభూతే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. అవును అత్తారింటికి వెళ్లేందురు రోడ్డు సరిగ్గా లేకపోవడంతో నవ వధులు వేకంగా 18 కిలోమీటర్లు నడకమార్గంలో వెళ్లాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

అత్తారింటికి వాహనాలు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఓ నవ వధువు ఏకంగా పెళ్లి దుస్తుల్లోనే 18 కిలోమీటర్ల నడిచి వెళ్లింది. దారంతా రాళ్లు రప్పలు ఉన్నా ఎలాగోలా కష్టపడి ఆమె అత్తారింటికి చేరుకుంది. ఉత్తరాఖండ్‌లోని చక్రాటా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన, ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న రహదారి సమస్యలు, అత్యవసర వైద్య సేవల కొరతను మరోసారి తెరపైకి తెచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. బల్హార్ గ్రామానికి చెందిన షర్మిలా అనే యువతికి ఇటీవలే పెళ్లి జరిగింది. అయితే ఆమె తమ గ్రామం నుంచి డెహ్రాడూన్ సమీపంలోని మారుమూల గ్రామమైన ఉండావాలోని అత్తవారింటికి పెళ్లి ఊరేగింపుతో బయలుదేరింది. అయితే ఆ గ్రామానికి సరిగ్గా రోడ్డు మార్గం లేదు అక్కడికి వాహనాలు వెళ్లలేవు.. దీంతో లోఖండి వద్ద పెళ్లి వారి వాహనాలన్నీ ఆగిపోయాయి. అక్కడి నుంచి ఉండావా చేరుకోవాటంటే ఇంకో 18 కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. కానీ అత్తారింటి దగ్గర గృహ ప్రవేశానికి నిర్ణయించిన శుభ ముహూర్త సమయం దగ్గర కావొస్తుంది. ఇక చేసేదేమి లేక ఆ నవ వధువు ముహూర్తం టైంకి ఎలాగైనా అత్తారింటికి చేరాలని ఆ పెళ్లి డ్రస్‌లోనే ఆ రాళ్లరోడ్డు 18 కిలో మీటర్లను నడిచి అత్తారింటికి చేరుకుంది.
ఉండావా గ్రామ సమీపంలోకి రాగానే ఆమె పూర్తిగా అసిపోయిన స్థితిలో కనిపించింది. అయితే ఆమె నడుస్తూ వస్తున్న దృశ్యాలను కొందరు వీడియో రికార్డ్ చేయగా.. తాను ఎదుర్కొన్న సమస్యను ఆమె ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. సమస్యను పరిష్కరించాలని నేరుగా రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామికి వీడియోద్వారా విజ్ఞప్తి చేసింది. తాను లోఖండి నుంచి ఉండావాకు కాలినడకన వచ్చానని.. భవిష్యత్తులో తనా తమ గ్రాస్థులు ఎవరూ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఉండావా గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంపై తీవ్ర చర్చ నెలకొంది. అయితే ఈ సమస్య ఈ ఒక్క గ్రామానికే పరిమితం కాదు. ఉండావతో పాటు సమీపంలోని హండి కండి వంటి ఇతర మారుమూల గ్రామాల్లోనూ ప్రజలు ఇదే తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నవవధువు పడిన కష్టం ద్వారా కొండ ప్రాంత గ్రామాల్లోని రహదారి, రవాణా సమస్యల తీవ్రత మరోసారి బహిర్గతమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాశ్వత రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
వీడియో చూడండి..
This Jaunsar-Bawar wedding video has taken social media by storm, for its culture, and for what it says about the lack of roads
A video from a wedding in Udawa village, Chakrata, in Dehradun district of Uttarakhand, is going viral, and for two very different reasons. The first is the tradition. In Jaunsar-Bawar, there’s a custom called “Jojod,” where it’s the bride who leads the baraat from her home to the groom’s.
On Tuesday, Sharmila from Bulhad village married Anil from Udawa village, following this centuries-old practice. The second is the road, or rather, the lack of one. Because Udawa has no motor road, the bride and her baraat had to walk around 8 km, for nearly two and a half hours, just to reach the groom’s house.
In one video, you see the beauty of a culture that has held on to its roots for generations, and the reality of villages still waiting for basic facilities. The same path the bride walked on her wedding day is the one villagers take when someone falls sick or needs anything from the market.
Sharmila has now asked CM Pushkar Singh Dhami to build a road to Udawa, so others don’t have to struggle the same way.
— Kumaon Jagran (@KumaonJagran) October 22, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
