AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : ఆ సాంగ్ అంటే పిచ్చి ఇష్టం.. చాలాసార్లు వింటూ ఫుల్ ఎంజాయ్ చేస్తా.. ప్రభాస్ చెప్పిన పాట ఇదే..

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే డార్లింగ్ సినిమాలతోపాటు ఆయనకు ఇష్టమైన విషయాలు గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Prabhas : ఆ సాంగ్ అంటే పిచ్చి ఇష్టం.. చాలాసార్లు వింటూ ఫుల్ ఎంజాయ్ చేస్తా.. ప్రభాస్ చెప్పిన పాట ఇదే..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Oct 23, 2026 | 5:23 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 23). ఇప్పటికే సోషల్ మీడియాలో డార్లింగ్ ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే డార్లింగ్ కు నచ్చిన పాట గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డార్లింగ్ తనకు నచ్చిన పాట గురించి వెల్లడించారు. ఆయనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రంలోని చలోరే చలోరే చల్ అనే సాంగ్ అత్యంత ఇష్టమైన పాటల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. ఈ పాట తనకు ఎంతగానో నచ్చుతుందని, ఇది తన ఫేవరెట్ పాటల్లో ఒకటని ఆయన స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda – Allu Arjun: అర్దరాత్రి బన్నీకి కాల్ చేసిన విజయ్ దేవరకొండ.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే..

చలోరే చలోరే చల్ పాటకు లోతైన అర్థం ఉందని, దాని సాహిత్యం చాలా డీప్‌గా ఉంటుందని ప్రభాస్ వివరించారు. అంతేకాకుండా, పాటలోని హై పిచ్, ఉత్సాహభరితమైన బీట్ , పార్టీ మూడ్‌కు సరిపోయే ట్యూన్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఇది వినడానికి చాలా బాగుంటుందని, ఒక హై మూడ్‌ను కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ పాటపై తనకున్న మక్కువను వివరిస్తూ ప్రభాస్ ఒక సరదా జ్ఞాపకాన్ని పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, కృష్ణవంశీ కాంబోలో రావాల్సిన వందేమాతరం సినిమా ఎందుకు ఆగిపోయిందంటే..

తాను పార్టీలలో ఉన్నప్పుడు, లేదా స్నేహితులు ఉన్నప్పుడు ఈ పాటను తరచుగా ప్లే చేసి, “చూడు చూడు, దీని అర్థం ఎంత డీప్‌గా ఉందో!” అంటూ వారికి వివరించేవారట. దీని వల్ల స్నేహితులు విసిగిపోయి, “అమ్మో, వీడు మళ్లీ చలోరే చలోరే చల్ స్టార్ట్ చేశాడు” అని చెప్పి పారిపోయేవారని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, అప్పట్లో పార్టీలలో రాత్రి 12 గంటలు కాగానే తాను ఈ పాటను పెడతానని స్నేహితులకు టెన్షన్ కూడా ఉండేదని ప్రభాస్ సరదాగా చెప్పారు. ఈ పాటలోని బీట్ ఎంతో పెప్పీగా ఉంటుందని, లోతైన ఫిలాసఫీతో పాటు ఉత్సాహాన్ని నింపుతుందని ఆయన తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీని ఏలుతున్న సంచలన క్రైమ్ థ్రిల్లర్..

చలోరే చలోరే చల్ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu: ఓటింగ్‏లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!

Follow Us