అప్పుడే పుట్టిన బిడ్డను లాక్కెళ్లిన జంతువు
ఉత్తరప్రదేశ్ లో గుండెలు తరుక్కుపోయే ఘటన చోటుచేసుకుంది. బహిర్భుమికి వెళ్లిన నిండు గర్బిణి నొప్పులు ఎక్కువ అవ్వడంతో అక్కడే బిడ్డను ప్రసవించి స్పృహ కోల్పోయింది. అప్పుడే పుట్టిన బిడ్డను గుర్తుతెలియని జంతువు లాక్కెంది. దీంతో ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రం మునింది.

యూపీలోని ఫిన్ హట్ పోలీసు స్టేషన్ పరిధిలోని జోధపురా గ్రామానికి చెందిన నెలలు నిండిన గర్భిణి.. ఇంటి సమీపంలోని పొలాల్లోకి బహిర్భుమికి వెళ్లింది. ఇంటికి ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కంగురుపడి వెతకడం మొదలు పెట్టారు. వారికి పొలాల్లో ప్రసవించి స్పృహ కోల్పోయిన మహిళను కుటుంబసభ్యులు గుర్తించారు. కానీ బిడ్డ కనిపించపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏదో జంతువు పసిబిడ్డను లాక్కెళ్లి ఉండొచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో సగానికిపైగా కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
…on Tuesday. According to the woman—Shilpi, who lost her infant to animal said, “I had went to farm field on nature’s call following which I suffered labour pain and gave birth to a kid and subsequently went unconscious. pic.twitter.com/CwkatwWJrp
— Arvind Chauhan (@arvindcTOI) June 24, 2020