UP Assembly election 2022: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్‌… సైకిల్‌ ఎక్కిన మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు

|

Jan 12, 2022 | 6:55 AM

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒక మంత్రి సహా నలుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి గుడ్‌బై చెప్పారు.

UP Assembly election 2022: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్‌... సైకిల్‌ ఎక్కిన మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు
Cm
Follow us on

Uttar pradesh Assembly election 2022: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ(BJP)కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒక మంత్రి సహా నలుగురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు(Uttar Pradesh Elections) దగ్గరపడుతున్న కొద్దీ జంపింగ్‌ జపాంగ్‌లు పెరుగుతున్నారు. రెండోసారి అధికారం కోసం వ్యూహాలు రచిస్తున్న బీజేపీకి గట్టి షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా ఓ మంత్రితో పాటు మొత్తం ఐదుగురు కాషాయ పార్టీకి రాంరాం చెప్పారు. బీజేపీకి గుడ్‌బై చెప్పి అఖిలేష్‌ యాదవ్ (Akhilesh Yadav) సమక్షంలో సమాజ్‌వాది పార్టీ (Samajwadi Party)లో చేరారు యూపీ కార్మిక మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య(Swami Prasad Maury). దళితులు, OBCలు, రైతులు, నిరుద్యోగులు, చిరువ్యాపారులపై అణచివేతకు నిరసనగా తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మౌర్య.

ఆయనతోపాటు మరో నలుగురు కమలానికి షాక్‌ ఇచ్చారు. బ్రిజేష్‌ ప్రజాపతి, రోషన్‌లాల్‌ వర్మ, భగవతి సాగర్‌, వినయ్‌ శాక్య తమ రాజీనామాలు ప్రకటించారు. తమ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఎస్పీ అధినేత అఖిలేశ్‌. UP అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 400కుపైగా సీట్లను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో యోగి సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు అఖిలేశ్. యూపీ పాలిటిక్స్‌పై కీలక కామెంట్స్‌ చేశారు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. యూపీలో పరిస్థితులు మారుతున్నాయనీ, 13 మంది BJP MLAలు సమాజ్‌వాది పార్టీలోకి చేరబోతున్నారని బాంబ్ పేల్చారు. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో కలిసి పోటీచేస్తామన్నారు శరద్. తాను అక్కడ ప్రచారం చేస్తానని ప్రకటించారాయన. ఇక గోవాలో కాంగ్రెస్‌, తృణమూల్‌తో కలసి కూటమి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు శరద్‌ పవార్‌. ఎన్నికల వేళ, యూపీ బీజేపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి.

Read Also…. Telangana: ప్రాణం లేక‌పోయినా ప్రాణ స్నేహితులం మేమున్నాం.. క‌న్నీరు తెప్పిస్తోన్న స్నేహ బంధం..