AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రాణం లేక‌పోయినా ప్రాణ స్నేహితులం మేమున్నాం.. క‌న్నీరు తెప్పిస్తోన్న స్నేహ బంధం..

Telangana: మ‌న‌కు అన్ని బంధాల‌ను ఆ భ‌గ‌వంతుడే ఇస్తాడు, కానీ ఒక్క స్నేహితుల‌ను మాత్రం మ‌న‌మే ఎంచుకుంటాం. అందుకే స్నేహ బంధం అంత గొప్ప‌ది. మ‌న‌ల్ని మ‌న‌గా స్వీక‌రించేది స్నేహితుడు ఒక్క‌డే...

Telangana: ప్రాణం లేక‌పోయినా ప్రాణ స్నేహితులం మేమున్నాం.. క‌న్నీరు తెప్పిస్తోన్న స్నేహ బంధం..
Narender Vaitla
|

Updated on: Jan 12, 2022 | 6:07 AM

Share

Telangana: మ‌న‌కు అన్ని బంధాల‌ను ఆ భ‌గ‌వంతుడే ఇస్తాడు, కానీ ఒక్క స్నేహితుల‌ను మాత్రం మ‌న‌మే ఎంచుకుంటాం. అందుకే స్నేహ బంధం అంత గొప్ప‌ది. మ‌న‌ల్ని మ‌న‌గా స్వీక‌రించేది స్నేహితుడు ఒక్క‌డే. ఏ బంధంలోనైనా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. కానీ అలాంటి స్వార్థానికి తావులేని బంధం ఒక్క స్నేహ‌మే. ఇంత‌టి గొప్ప బంధానికే గొప్ప‌త‌నం తీసుకొచ్చారు మ‌హ‌హూబాబాద్ జిల్లాకు చెందిన కొంద‌రు యువ‌కులు. త‌మ ప్రాణ స్నేహితుడు ప్రాణాల‌తో లేక‌పోయినా, పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించి అంద‌రినీ కంట‌త‌డి పెట్టించారు.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌హబూబాబాద్ జిల్లా కేస‌ముద్రం మండ‌లం రాజీవ్ న‌గర్ తండాకు చెందిన బాలాజీ అనే యువ‌కుడు గ‌త డిసెంబ‌ర్ 10 రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు. ఎంతో క‌లివిడ‌గా స‌ర‌దాగా ఉండే బాలాజీ త‌మ క‌ళ్ల ముందే అకాల మ‌ర‌ణం చెంద‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు, స్నేహితులు కూడా ఒక్క‌సారిగా షాక్‌కి గుర‌య్యారు. ప్రాణ‌ స్నేహితుడి లేని లోటును ఎంత‌కీ మ‌రిచిపోలేక‌పోయారు. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం (జ‌న‌వ‌రి 10) బాలాజీ జ‌న్మ‌దినం వ‌చ్చింది. ప్ర‌తీ ఏటా ఎంతో సంబురంగా ఫ్రెండ్స్‌తో పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకునే బాలాజీ అనంత లోకాల‌కు వెళ్ల‌డంతో అత‌ని స్నేహితులు త‌ట్టుకోలేక‌పోయారు.

దీంతో త‌మ ప్రాణ స్నేహితుడు త‌మ మ‌ధ్య లేక‌పోయినా పుట్టిన రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌నుకున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌న్మ‌దినం సంద‌ర్భంగా స్నేహితుడిని గుర్తు చేసుకుంటూ స్మ‌శాన‌ వాటిక‌లో స‌మాధి వ‌ద్ద కేక్ క‌ట్ చేశారు. అంత‌కు ముందు స‌మాధిని మొత్తం పూల‌తో అలంక‌రించారు. అనంత‌రం స్నేహితుడుతో గ‌డిపిన మ‌ధుర జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసుకొని క‌న్మీరుమున్నీరుగా విల‌పించారు. ఇక ప్ర‌తీ ఒక్క‌రూ త‌ప్ప‌కుండా హెల్మెట్ ధ‌రించండ‌ని, త‌మ స్నేహితుడిలా ఎవ‌రూ కాకూడ‌దంటూ యువ‌కులు వేడుకున్న తీరు అంద‌రినీ క‌ట్ట‌త‌డి పెట్టిస్తోంది.

Also Read: World Record: ముద్దుగుమ్మ రికార్డులు బద్దలు.. 50 మిలియన్లకు పైగా లైక్‌లు.. అదే ఈ ‘గుడ్డు’ స్పెషల్..

Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం.. నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య.. కత్తితో

Gadget Guru video: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? అయితే ఇది తప్పనిసరిగా తెలుసుకోండి..(వీడియో)

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్