అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కీలక నిర్ణయం.. 17 ఏళ్ల ఆ ఇంటి బంధాన్ని తెంచుకోనున్న వైనం

అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన మహిళ కమలా హారిస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటితో దాదాపు 17 ఏళ్లుగా ఉన్న బంధాన్ని....

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కీలక నిర్ణయం.. 17 ఏళ్ల ఆ ఇంటి బంధాన్ని తెంచుకోనున్న వైనం

అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన మహిళ కమలా హారిస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటితో దాదాపు 17 ఏళ్లుగా ఉన్న బంధాన్ని తెంచుకోనున్నారు. వివరాల్లోకి వెళితే.. శాన్‌ఫ్రాన్సిస్కో సౌతాఫ్‌ మార్కెట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై అంతస్తులో ఉన్న తన ఇంటిని కమలా హారిస్‌ అమ్మకానికి పెట్టినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని వెలువరించింది. అన్ని విధాలుగా సదుపాయాలున్న ఈ భవనాన్ని 7,99,000 డాలర్లకు అమ్మాలని కమలా హారిస్‌ నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.

కాగా, కమలా హారిస్‌ ఆ ఇంటిని 2004లో కొనుగోలు చేశారు. అందులోనే దాదాపు 17 ఏళ్ల పాటు నివసించారు. ఆ సమయంలో ఆమె శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా, కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాషింగ్టన్‌కు వెళ్లిపోయారు. ఉపాధ్యక్షురాలిగా అధికార నివాసంలో ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా అధ్యక్షుడి అతిథి గృహం బ్లెయిర్‌ హౌస్‌లో నివసిస్తున్నారు.

Also Read:

Galwan Incident: గాల్వన్‌ ఘటనపై నోరు విప్పిన జిత్తుల మారి.. తమ సైనికులు కూడా చనిపోయారంటూ నిజాన్ని అంగీకరించిన చైనా

సంచలన నిర్ణయం తీసుకున్న బ్రిటన్ యువరాజు హ్యారీ.. రాచరికపు మర్యాదలను వదలుకుంటున్నట్లు వెల్లడి

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu