అమెరికాలో భారీ హ‌నుమంతుడి విగ్రహం..

అగ్ర‌రాజ్యం అమెరికాలోనే అతిపెద్ద ఆంజ‌నేయుడి​ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు స‌న్నాహ‌కాలు మొద‌ల‌య్యాయి. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే విగ్రహాన్ని రూపొందించింది హిందూ దేవాలయాల సంఘం.

అమెరికాలో భారీ హ‌నుమంతుడి విగ్రహం..

Updated on: Jun 14, 2020 | 5:42 PM

అగ్ర‌రాజ్యం అమెరికాలోనే అతిపెద్ద ఆంజ‌నేయుడి​ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు స‌న్నాహ‌కాలు మొద‌ల‌య్యాయి. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే విగ్రహాన్ని రూపొందించింది హిందూ దేవాలయాల సంఘం. డెలవేర్ రాష్ట్రం హాకెసిన్​లో ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అయితే.. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో భారీ స్థాయిలో కాకుండా.. సాధారణ ఏర్పాట్లతో విగ్రహ ప్రతిష్ట చేయనున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు. 25 ఫీట్ ఎత్తైన హనుమాన్​ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఇప్ప‌టికే యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

‘నల్లటి గ్రానైట్​ రాయితో ఆంజ‌నేయుడి​ విగ్రహాన్ని చెక్కారు. ప్రతిమ పూర్తి రూపం వ‌చ్చేందుకు సుమారు సంవ‌త్స‌ర‌ సమయం పట్టింది. విగ్రహం పూర్తయిన అనంత‌రం ఆలయానికి అందిస్తాం. ఆలయ పూజారులు 10 రోజుల పాటు భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో పూజలు నిర్వహిస్తారు’ అని హిందూ ఆలయాల సంఘం అధ్యక్షుడు పాటిబంద శర్మ పేర్కొన్నారు.

డెలవేర్​ స్టేట్ లో న్యూక్యాజిల్​ హోలీ స్పిరిట్​ చర్చ్ లోని ‘ఔర్ లేడీ క్వీన్​ ఆఫ్​ పీస్’​ విగ్రహం అతి పెద్దదిగా ఫ‌స్ట్ ప్లేసులో ఉండగా.. త్వరలోనే ప్రతిష్టించనున్నహనుమాన్​ విగ్రహం సెకండ్ ప్లేసులో నిలువనుంది.