గ్రీన్ కార్డులపై బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం, లక్షలాది భారతీయులకు ఊరట

| Edited By: Pardhasaradhi Peri

Dec 04, 2020 | 4:16 PM

అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులపై గల ఆంక్షలను ఎత్తివేయడానికి ఉద్దేశించిన బిల్లును  యూఎస్ సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం  7 శాతం ఆంక్షలతో ఏటా లక్షా 40 వేల గ్రీన్ కార్డులను..

గ్రీన్ కార్డులపై బిల్లుకు  యూఎస్ సెనేట్ ఆమోదం, లక్షలాది భారతీయులకు ఊరట
Follow us on

అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులపై గల ఆంక్షలను ఎత్తివేయడానికి ఉద్దేశించిన బిల్లును  యూఎస్ సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం  7 శాతం ఆంక్షలతో ఏటా లక్షా 40 వేల గ్రీన్ కార్డులను జారీ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి సుమారు 8 లక్షలమంది భారతీయులు ‘ఎంప్లాయ్ మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డులకోసం’ ఎదురు చూస్తున్నారని యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్  డేటా ప్రకారం తెలుస్తోంది. ఉపాధి ఆధారిత ఇమిగ్రెంట్ వీసాలపై ఆంక్షలను ఎత్తివేయడంతో బాటు , ఫ్యామిలీ ఆధారిత వీసాలుగా మార్చడానికి ఉద్దేశించిన బిల్లు ముఖ్యంగా అమెరికాలో గ్రీన్ కార్డులకోసం వేచి ఉన్న లక్షలాది భారతీయులకు ఊరటనిచ్ఛే అంశం. హెచ్ 1 బీ వీసాలపై యూ ఎస్ వచ్ఛే ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ కు మరింత ప్రయోజనం కలగనుంది. ఈ బిల్లుకు అనుకూలంగా 365, వ్యతిరేకంగా 65 ఓట్లు వచ్చాయి.

ఫెయిర్ నెస్ ఫర్ హై స్కిల్డ్ వర్కర్స్ యాక్ట్ హెచ్ ఆర్ 1044 బిల్లును ప్రతినిధుల సభ గతంలో ఆమోదించగా, దానికి,  సెనేట్ ఆమోదించిన బిల్లుకు చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు. ఇది ప్రాథమిక ఆమోదం మాత్రమేనని, ప్రతినిధుల సభకు కూడా ఈ బిల్లు వెళ్లాల్సి ఉందని, బహుశా హౌస్ ఈ బిల్లును ఆమోదించకపోవచ్చునని ఒక లా సంస్థ నిపుణుడు నందినీ నాయర్ అభిప్రాయపడ్డారు. ఇందుకు కారణం సైనిక సంబంధాలు గల చైనీయులను కూడా ఈ బిల్లులో చేర్చడమే అన్నారు.