దక్షిణాసియా దేశాలకు చైనా నుంచి ముప్పే: మైక్‌ పాంపియో

|

Jun 26, 2020 | 4:10 PM

దక్షిణాసియా దేశాలకు చైనా నుంచి ఎప్పటికైనా ముప్పే అన్నారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో. చైనా ముప్పును ఎదుర్కొనేందుకు భారతదేశానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. జర్మనీలో ఉన్న అమెరికా బలగాలను భారత్‌కు పంపిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

దక్షిణాసియా దేశాలకు చైనా నుంచి ముప్పే: మైక్‌ పాంపియో
Follow us on

దక్షిణాసియా దేశాలకు చైనా నుంచి ఎప్పటికైనా ముప్పే అన్నారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో. చైనా ముప్పును ఎదుర్కొనేందుకు భారతదేశానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. జర్మనీలో ఉన్న అమెరికా బలగాలను భారత్‌కు పంపిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన బ్రసెల్స్‌ ఫోరం వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జర్మనీ స్థావరంగా ఉన్న అమెరికా సాయుధ బలగాల సంఖ్యను ఎందుకు తగ్గిస్తున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు అయన సమాధానమిచ్చారు. చైనా కవ్వింపుచర్యలతో భారత్‌ను భయభ్రాంతులకు చేస్తుందన్నారు. చైనా దక్షిణాసియా దేశాలపై అధిపత్యం ధోరణితో వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌ దేశాలకూ ముప్పు పొంచి ఉందన్నారు పాంపియో. అమెరికా ఆసియాలో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. దక్షిణ చైనా సముద్రంలోనూ అలజడి సృష్టించేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నిస్తోందని.. ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కోవడానికి అమెరికా బలగాలను మోహరిస్తామని స్పష్టం చేశారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి బదులివ్వడానికి అవసరమైన వనరులన్నింటినీ వినియోగిస్తామని పాంపియో స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలపై అమెరికా నిఘా ఉంటుందని అవసరమైన చోటికి అమెరికా బలగాలు రక్షణగా నిలుస్తాయన్నారు. ఇందులో భాగంగానే అమెరికా అధ్యక్షుడు జర్మనీలో అమెరికా సాయుధ బలగాలను ఉంచారన్నారు. అలాగే, చైనా నుంచి ముప్పు ఉన్న భారత్‌తో సహా ఇతర దేశాలకు మద్దతుగా దక్షిణచైనా సముద్రం ప్రాంతంలోకి అమెరికా బలగాలను పంపిస్తున్నామని పాంపియో తెలిపారు.