అమెరికాలో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 25,621 పాజిటివ్ కేసులు..

| Edited By:

May 10, 2020 | 5:42 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకూ మరింత పెరుగుతూ పోతున్నాయి. ఒక్క శనివారం రోజున అమెరికా వ్యాప్తంగా

అమెరికాలో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 25,621 పాజిటివ్ కేసులు..
Follow us on

Coronavirus In US: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకూ మరింత పెరుగుతూ పోతున్నాయి. ఒక్క శనివారం రోజున అమెరికా వ్యాప్తంగా 25,621 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి శనివారం 1,615 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 13,47,318 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 80 వేలు దాటింది.

కాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణాల అంచనాలో రోజుకో మాట చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆయన కరోనా కేసులు లక్ష నుంచి రెండు లక్షల మధ్య ఉండొచ్చని మరోమారు మాట మార్చారు. మరోవైపు.. అమెరికా ప్రభుత్వంపై మాజీ అధ్యక్షుడు ఒబామా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికా ప్రభుత్వం కరోనాపై తీసుకున్న చర్యలు డిజాస్టర్ అని ఒబామా తన హయాంలో సేవలందించిన అధికారులతో అన్నారు. దీనికి సంబంధించిన ఆడియో లీక్ అవడంతో ఈ సంభాషణలు బయటపడ్డాయి.

Also Read: గుడ్ న్యూస్: ఆ మూడు ఔషధాలతో.. కరోనా ఖతం..