కమలాహారిస్ మొట్టమొదటి ఫోన్‌ బైడెన్‌కే.!

అమెరికా ఎన్నికల్లో భారతీయ కమలం విరబూసింది. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ జయకేతనం ఎగురవేసింది. విజయం తేలిపోవడంతో.. మొట్టమొదటి ఫోన్‌ బైడెన్‌కు చేసింది కమలాహారిస్‌. “వియ్‌ డిడ్‌ ఇట్‌.. వియ్ డిడ్ ఇట్ జో.. యు ఆర్ గోయింగ్ టు బి ద నెక్ట్స్‌ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్”. అంటూ.. నెక్ట్స్‌ ప్రెసిడెంట్‌గా నువ్వే ప్రమాణం చేస్తున్నావని కితాబిస్తూ సంబరాల్లో మునిగిపోయారు. కమలా తన విజయాన్ని భర్తతోనూ పంచుకుంది. ఉపాధ్యక్షురాలిగా ఎంపిక కావడంపై […]

  • Venkata Narayana
  • Publish Date - 12:54 pm, Sun, 8 November 20
కమలాహారిస్ మొట్టమొదటి ఫోన్‌ బైడెన్‌కే.!

అమెరికా ఎన్నికల్లో భారతీయ కమలం విరబూసింది. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ జయకేతనం ఎగురవేసింది. విజయం తేలిపోవడంతో.. మొట్టమొదటి ఫోన్‌ బైడెన్‌కు చేసింది కమలాహారిస్‌. “వియ్‌ డిడ్‌ ఇట్‌.. వియ్ డిడ్ ఇట్ జో.. యు ఆర్ గోయింగ్ టు బి ద నెక్ట్స్‌ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్”. అంటూ.. నెక్ట్స్‌ ప్రెసిడెంట్‌గా నువ్వే ప్రమాణం చేస్తున్నావని కితాబిస్తూ సంబరాల్లో మునిగిపోయారు. కమలా తన విజయాన్ని భర్తతోనూ పంచుకుంది. ఉపాధ్యక్షురాలిగా ఎంపిక కావడంపై హగ్‌ చేసుకుని.. సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఎన్నిక తన గురించి, బైడెన్​ గురించి కాదని.. ఇది అమెరికా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు కమలాహారిస్‌. ముందుముందు చేయాల్సిన పని చాలా ఉంది.. రంగంలోకి వెంటనే దిగాలని ఆమె ఈ సందర్భంలో చెప్పారు.