AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భక్తులకు డబుల్ గుడ్‌న్యూస్

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కార్యనిర్వాహణాధికారి ఒకే రోజు రెండు శుభవార్తలు ప్రకటించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో తొలిసారి పాల్గొన్న కొత్త ఈవో జవహర్ రెడ్డి భక్తులు కోరిన రెండు కోరికలపై సానుకూలంగా స్పందించారు.

శ్రీవారి భక్తులకు డబుల్ గుడ్‌న్యూస్
Rajesh Sharma
|

Updated on: Nov 08, 2020 | 4:13 PM

Share

Double good-news for Srivari devotees: తిరుమల శ్రీవారి భక్తులకు ఒకేసారి రెండు శుభవార్తలు తెలిపారు టీటీడీ కొత్త ఈవో జవహర్ రెడ్డి. ఆదివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈ శుభవార్తలను వెల్లడించారు జవహర్ రెడ్డి. తిరుమలలోని అన్నమయ్య భవన్ నుంచి డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్నారు టీటీడీ ఈవో. ‘‘ఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సారి ఫోన్ ద్వారా 30 మంది భక్తుల సలహాలు, సూచనలు తీసుకున్నా.. సర్వదర్శన టోకెన్లు పెంచి మరింత మంది సామాన్య భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించాలని భక్తులు చాలా మంది కోరారు. వారి కోరికకు అనుగుణంగా త్వరలో సర్వదర్శన టోకెన్లను పెంచుతాం.. ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను కూడా అదనంగా ఆన్ లైన్‌లో భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు కోరారు… దానిని కూడా టీటీడీ పరిశీలిస్తోంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.. ’’ అని ఈవో జవహర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నాదనీరాజన మండపంలో నిర్వహించే సుందరకాండ పారాయణానికి విశేషంగా భక్తుల నుండి స్పందన లభిస్తోందని ఈవో తెలిపారు. కరోనా సమయంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆలయంలో తీసుకున్న చర్యల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారని ఆయనన్నారు. భక్తుల సౌకర్యాలు మరింత మెరుగు పరిచేందుకు టీటీడీ కృషి చేస్తోందని తెలిపారు. 16 గంటల పాటు సుందరకాండ పారాయణం నిర్వహించాలని భక్తులు కోరారని, సనాతన ధర్మ‌ ప్రచారానికి టీటీడీ పెద్ద ఎత్తున కృషి చేస్తుందని జవహర్ రెడ్డి వివరించారు.

ALSO READ: కేదార్‌నాథ్ చేరిన సంతోష్ సంకల్పం

ALSO READ: పార్టీ స్టాండ్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేత ఫ్లెక్సీలు

ALSO READ: రెచ్చిపోయిన బైక్ రైడర్.. ఒకరి మృతి

ALSO READ: వాడికి ఉరేస్తేనే మాకు ఆత్మసంతృప్తి.. దివ్య పేరెంట్స్ సంచలన కామెంట్స్