తెరపైకి రజనీకాంత్ బయోపిక్.. సూపర్‌స్టార్‌గా ధనుష్..!
ప్రతి ఇండస్ట్రీలోనూ బయోపిక్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. ప్రముఖుల జీవిత చరిత్రలు చూసేందుకు ప్రేక్షకులు బాగా ఆసక్తిని చూపుతుండటంతో

Rajinikanth Biopic News: ప్రతి ఇండస్ట్రీలోనూ బయోపిక్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. ప్రముఖుల జీవిత చరిత్రలు చూసేందుకు ప్రేక్షకులు బాగా ఆసక్తిని చూపుతుండటంతో దర్శకనిర్మాతలు సైతం బయోపిక్‌లు తీసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ బయోపిక్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి కోలీవుడ్‌లో. ( Bigg Boss 4: ‘బిగ్‌బాస్’లోకి సుమ వైల్డ్‌కార్డు ఎంట్రీ.. ప్రోమో రిలీజ్)
రజనీకాంత్‌కి పెద్ద అభిమాని అయిన ప్రముఖ దర్శకుడు లింగుస్వామి సూపర్‌స్టార్ బయోపిక్‌ని తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో రజనీ పాత్రలో ఆయన పెద్దల్లుడు ధనుష్‌ని నటింపజేయాలని భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు కూడా తెలుస్తోంది. ( బాబాయ్, నేను కలిసి నటించబోతున్నాము.. కన్ఫర్మ్ చేసిన రానా)
కాగా సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్ కండెక్టర్‌గా పనిచేశారు. కె.బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాగన్‌గల్ మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలతో పాటు పలు అమెరికన్ సినిమాల్లో మెరిశారు. కండెక్టర్ నుంచి టాప్ హీరోగా ఎదిగిన ఆయన జీవితాన్ని ఎంతోమంది ఆదర్శంగా భావిస్తారు. ( కరోనా అప్‌డేట్స్: దేశవ్యాప్తంగా 85లక్షలు దాటిన కేసుల సంఖ్య)