వాషింగ్టన్ లో నేషనల్ గార్డులకు యూఎస్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ చాక్లెట్ చిప్ కుకీలను అందించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం సందర్భంలో రక్షణగా ఉన్న సుమారు 25 వేలమంది నేషనల్ గార్డుల్లో చాలామంది శుక్రవారం అనూహ్యంగా కాంగ్రెస్ భవనం పక్కనున్న పార్కింగ్ గ్యారేజీలో ప్రవేశించారు. ఈ పార్కింగ్ స్లాట్స్ లో కొందరు ఫోన్లను ఛార్జింగ్ చేసుకున్నారు. ఇతర సౌకర్యాలను వినియోగించుకున్నారు. అయితే చలిలోనే వీరు ఇలా ‘మగ్గడాన్ని’ చూసిన కాంగ్రెస్ సభ్యులు పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత చల్ వాతావరణంలో ఇలా వదిలివేయడం ఈ యూనిట్ కే అవమానకరమని వారన్నారు. ఈ గార్డులు క్యాపిటల్ హిల్ ను రక్షించిన సైనికులవంటివారని పేర్కొన్నారు. ఇదే సమయంలో జో బైడెన్ భార్య జిల్ బైడెన్.. అక్కడకి వచ్చి ..ఈ గార్డులకు ఆప్యాయంగా చాక్లెట్ చిప్ కుకీలను అందించారు. ఇది వారికి, కాంగ్రెస్ ఎంపీలకు కూడా ఆశ్చర్యం కలిగించింది. బహుశా ఈ గార్డుల సేవా నిరతిపట్ల ఆమె పొంగిపోయి ఉండవచ్ఛునని భావిస్తున్నారు.
Read Also:ఫ్యాన్స్‌కి ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ స్పెషల్ దీపావళి గిఫ్ట్.. సంప్రదాయ దుస్తుల్లో అదరగొడుతున్న ఎన్టీఆర్, చెర్రీ.