
తమ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎన్నుకోవడానికి టిబెటన్లకు గల హక్కును అమెరికా అంగీకరించింది. ఇందుకు ఉద్దేశించిన బిల్లును యూఎస్ సెనేట్ ఆమోదించింది. ఇది చరిత్రాత్మకమని, చైనాకు క్లియర్ మెసేజ్ అని ధర్మశాల పేర్కొంది. ‘టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ 2020 పపేరిట ఈ బిల్లుకు సెనేట్ ఆమోదముద్ర వేసింది. టిబెట్ లోని లాసాలో యూఎస్ దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ బిల్లులో నిర్దేశించారు. దలైలామా వారసుడి ఎంపికపై టిబెట్ లో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. టిబెట్ పై ఆధిపత్యం తమదేనని చైనా ప్రకటించుకుంటున్న నేపథ్యంలో అమెరికా ఈ బిల్లును ఆమోదించడం విశేషం. దలైలామా వారసుడి ఎంపికలో చైనా ఎలాంటి జోక్యం చేసుకున్నా తాము సహించబోమని, చైనాపై తీవ్ర ఆంక్షలు విధించే యోచన చేస్తామని అమెరికా హెచ్చరించింది. ప్రతినిధుల సభ ఈ బిల్లును ఇదివరకే ఆమోదించింది.
అయితే చైనా దీనిపై ఆగ్రహం ప్రకటిస్తూ ఈ బిల్లుపై సంతకం చేయరాదని డోనాల్డ్ ట్రంప్ ను కోరింది. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని కోరింది. 14 వ దలైలామా ఎంపికపై ఆ దేశం ఇదివరకే దృష్టి పెట్టింది.