AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబై పేలుళ్ల సూత్రధారిని పట్టిస్తే 50 లక్షల డాలర్లు, అమెరికా భారీ నజరానా

మొట్టమొదటిసారిగా కరడు గట్టిన ఉగ్రవాదిని పట్టుకునేందుకు అమెరికా నడుం బిగించింది. భారత ప్రభుత్వం చేయలేని పనికి తానే శ్రీకారం చుట్టింది.

ముంబై పేలుళ్ల సూత్రధారిని పట్టిస్తే 50 లక్షల డాలర్లు, అమెరికా భారీ నజరానా
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 28, 2020 | 11:54 AM

Share

మొట్టమొదటిసారిగా కరడు గట్టిన ఉగ్రవాదిని పట్టుకునేందుకు అమెరికా నడుం బిగించింది. భారత ప్రభుత్వం చేయలేని పనికి తానే శ్రీకారం చుట్టింది. 2008 నవంబరు 26 న ముంబైలో జరిగిన భారీ పేలుళ్లకు సూత్రధారి అయిన పాక్ లష్కరే తోయిబా సభ్యుడు సాజిద్ మిర్ ని పట్టుకునేందుకు సాయపడే సమాచారం అందించినవారికి 50 లక్షల డాలర్ల   భారీ రివార్డు  అందజేస్తామని ప్రకటించింది. నాటి ఘోర దురంతంలో ఇతని పాత్ర ఎంతో ఉందని యుఎస్ రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ సంస్థ పేర్కొంది. వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో మిర్ పేరు మొదటి స్థానంలో ఉంది. ఏ దేశంలో ఇతడు ఉన్నా ఇతని అరెస్టుకు సహాయపడే కీలక సమాచారం అందజేస్తే చాలు, ఈ అత్యధిక రివార్డు వారికే సొంతమవుతుందని  ఈ సంస్థ వెల్లడించింది.

2008 నవంబరు 26 న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ముంబైలోని పలు హోటళ్లు, ప్రదేశాలను టార్గెట్లుగా చేసుకుని ధ్వంస రచనకు పూనుకొంది. ఈ నగరంలోని తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియో పోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, చత్రపతి శివాజీ టర్మినస్ వంటి పలు చోట్ల జరిగిన పేలుళ్లలో 166 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారు. ఆ ఘటనలో 9 మంది టెర్రరిస్టులు కూడా మృతి చెందగా సజీవంగా పట్టుబడిన ఒకే ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను 2012 నవంబరు 11 న పూణే లోని ఎరవాడ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు.సాజిద్ మిర్ ను అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు 2011 ఏప్రిల్ 11 న దోషిగా ప్రకటించింది. ఉగ్రవాదులకు అన్ని విధాలా సాయపడ్డాడని, ఓ దేశంలో భారీ ప్రాణ, ఆస్థి నష్టానికి కారకుడయ్యాడని పేర్కొంది.

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే