శివసేన ఎమ్మెల్సీగా ఊర్మిళా నామినేట్..!

ప్రముఖ నటి ఊర్మిళా మంతోడ్కర్ త్వరలో ఎమ్మెల్సీగా ప్రజా ప్రతినిధిగా మారబోతున్నారు. ఆమెను శివసేన ఎమ్మెల్సీగా నామినేట్ చేయనున్నట్లు సమాచారం.

శివసేన ఎమ్మెల్సీగా ఊర్మిళా నామినేట్..!
Balaraju Goud

|

Oct 31, 2020 | 10:29 AM

ప్రముఖ నటి ఊర్మిళా మంతోడ్కర్ త్వరలో ఎమ్మెల్సీగా ప్రజా ప్రతినిధిగా మారబోతున్నారు. ఆమెను శివసేన ఎమ్మెల్సీగా నామినేట్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై సీఎం ఉద్ధవ్ తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యే 12 మందిలో ఊర్మిళా పేరు కూడా దాదాపు ఖరారు అయ్యినట్లు నేతలు చెబుతున్నారు. ఊర్మిళా గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నార్త్ ముంబై నుంచి బరిలోకి దిగిన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. ఊర్మిళాను ఎమ్మెల్సీగా నామినేట్ చేసే విషయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఊర్మిళను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నారన్న ఊహాగానాలను నేనూ విన్నాను. అది రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుంది. చివరి నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ కే అధికారమిచ్చామని సంజయ్ రౌత్ తెలిపారు. అయితే గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. అందులో ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితాపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu