AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మతాంతర వివాహాలను ప్రోత్సహించే 44 ఏళ్ల కిందట పథకాన్ని రద్దు చేసిన యోగి సర్కార్‌

లవ్‌ జిహాద్‌ పేరుతో మతమార్పిడులు జరుగుతున్నాయంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొచ్చింది.. ఉత్తరప్రదేశ్‌ బాటలోనే చాలా రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. కొత్తగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌..

మతాంతర వివాహాలను ప్రోత్సహించే 44 ఏళ్ల కిందట పథకాన్ని రద్దు చేసిన యోగి సర్కార్‌
Balu
|

Updated on: Dec 02, 2020 | 4:31 PM

Share

లవ్‌ జిహాద్‌ పేరుతో మతమార్పిడులు జరుగుతున్నాయంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకొచ్చింది.. ఉత్తరప్రదేశ్‌ బాటలోనే చాలా రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. కొత్తగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారం మతమార్పిడులకు పాల్పడేవారికి పదేళ్లు కఠిన శిక్ష అమలు కానుంది.. ఇక ఇప్పుడు కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించే ఓ పాత పథకానికి కూడా స్వస్తి చెప్పాలనుకుంటోంది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించడం కోసం 44 ఏళ్ల కిందట ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఓ స్కీమ్‌ను తెచ్చింది. 1976లో ప్రవేశపెట్టిన ఆ స్కీమ్‌ను ఇప్పుడు రద్దు చేయాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి యోగి. భిన్న మతాల వారు పెళ్లి చేసుకుంటే పెళ్లి జరిగిన రెండేళ్లలోపు జిల్లా మెజిస్ట్రేట్‌కు అప్లై చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆమోదం పొందితే ఆ దంపతులకు 50 వేల రూపాయలు ప్రోత్సాహకంగా అందుతాయి.. గత ఏడాది ఈ స్కీమ్‌ కింద 11 జంటలు లబ్ధిపొందాయి. ఈ ఏడాది అలాంటి వివాహాలు జరిగినా ఏ ఒక్కరికి నగదు ఇవ్వలేదు.. ఈ స్కీమ్‌ కోసం నాలుగు దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఇదిగో పెద్దపులి.. కూర్మాపురంలో టెన్షన్ టెన్షన్.. పూరిపాకలో నక్కి
ఇదిగో పెద్దపులి.. కూర్మాపురంలో టెన్షన్ టెన్షన్.. పూరిపాకలో నక్కి
ఈ ఐదు సూపర్ ఫుడ్స్ మీ ఆహారంలో ఉంటే.. ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే
ఈ ఐదు సూపర్ ఫుడ్స్ మీ ఆహారంలో ఉంటే.. ఆ సమస్యకు చూమంత్రం వేసినట్టే
ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు..
ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు..
పంజాబ్‌లో ఆప్‌ నేత దారుణహత్య.. సీసీటీవీలో కాల్పుల దృశ్యాలు
పంజాబ్‌లో ఆప్‌ నేత దారుణహత్య.. సీసీటీవీలో కాల్పుల దృశ్యాలు
భర్త మిలటరీలో.. భార్య గర్భవతి.. కోర్టు ఏం చెప్పిందంటే..?
భర్త మిలటరీలో.. భార్య గర్భవతి.. కోర్టు ఏం చెప్పిందంటే..?
లాభం కంటే నష్టమే ఎక్కువ.. ఈ ఫొటో మీ ఇంట్లో ఉందా?
లాభం కంటే నష్టమే ఎక్కువ.. ఈ ఫొటో మీ ఇంట్లో ఉందా?
అంధత్వాన్ని వెనక్కినెట్టి.. APPSC గ్రూప్‌ 2లో మెరిసిన యువకుడు!
అంధత్వాన్ని వెనక్కినెట్టి.. APPSC గ్రూప్‌ 2లో మెరిసిన యువకుడు!
రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు
రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు
భోజనం తర్వాత ఈ ఒక్కటీ తినండి.. మీ శరీరంలో అద్భుతాలు చూస్తారు..!
భోజనం తర్వాత ఈ ఒక్కటీ తినండి.. మీ శరీరంలో అద్భుతాలు చూస్తారు..!
ప్రశాంత్ కిషోర్ పార్టీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్!
ప్రశాంత్ కిషోర్ పార్టీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్!