మరో సారి ఢిల్లీ దిగ్బంధం.. ఈసారి పక్కా ప్లాన్.. ?

కొన్ని నెలల క్రితం పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరిన ఉత్తర్ ప్రదేశ్ రైతాంగాం దేశ రాజధానిని దిగ్బంధం చేసిన ఉదంతం మరవక ముందే మరో సారి అదే తరహా ఆందోళనా వ్యూహంతో ఢిల్లీని ముట్టడించేందుకు యూపీ రైతులు బయలుదేరారు. ఢిల్లీ-యూపీ సరిహద్దులో మోహరించిన రైతులు.. వారి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడేందుకు 15 మంది రైతులు ప్రతినిధులను ఢిల్లీ కి పంపించారు. వారి సంప్రదింపుల అవుట్ కమ్ తెలిస్తే… ఢిల్లీ ముట్టడింపు పై తుది నిర్ణయం […]

  • Rajesh Sharma
  • Publish Date - 1:15 pm, Sat, 21 September 19
మరో సారి ఢిల్లీ దిగ్బంధం.. ఈసారి పక్కా ప్లాన్.. ?

కొన్ని నెలల క్రితం పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరిన ఉత్తర్ ప్రదేశ్ రైతాంగాం దేశ రాజధానిని దిగ్బంధం చేసిన ఉదంతం మరవక ముందే మరో సారి అదే తరహా ఆందోళనా వ్యూహంతో ఢిల్లీని ముట్టడించేందుకు యూపీ రైతులు బయలుదేరారు. ఢిల్లీ-యూపీ సరిహద్దులో మోహరించిన రైతులు.. వారి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడేందుకు 15 మంది రైతులు ప్రతినిధులను ఢిల్లీ కి పంపించారు. వారి సంప్రదింపుల అవుట్ కమ్ తెలిస్తే… ఢిల్లీ ముట్టడింపు పై తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు యూపీ రైతులు.
ఉత్తరప్రదేశ్‌లోని రైతులు ఢిల్లీ వైపుగా ర్యాలీ తీస్తున్నారు. భారతీయ కిసాన్ సంఘటన ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతోంది. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ దిశగా రైతులు వెళ్తున్నారు. చెరుకు పంట బకాయిలు చెల్లించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇతర పంటలకు కూడా రుణమాఫీని ప్రకటించాలని కోరుతున్నారు. ఢిల్లీ-యూపీ బోర్డర్ వద్ద ఉన్న ఘాజీపూర్‌లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కిసాన్ ఘాట్ వైపు వస్తున్న రైతులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపితే, తాము తిరిగి వెనక్కి వెళ్తామని భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు పురాన్ సింగ్ తెలిపారు.