ఏపీ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేత.!

దేశవ్యాప్తంగా రేపటి నుంచి అన్‌లాక్‌ 4.0 ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలోనే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఏపీ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేత.!

Edited By:

Updated on: Sep 01, 2020 | 12:53 PM

Unlock 4.0 Guidelines: దేశవ్యాప్తంగా రేపటి నుంచి అన్‌లాక్‌ 4.0 ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలోనే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి అంతర్రాష్ట్ర ప్రయాణాలపై పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయాలని.. ఈ నిబంధనను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది.

ఈ క్రమంలోనే తమిళనాడుతో సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే అంతర్రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేశాయి. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఇదే బాట పట్టింది. సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల వద్ద ఆంక్షలు ఎత్తివేసింది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు యధావిధిగా సాగుతున్నాయి.  కాగా, అన్‌లాక్‌ 4.0 నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా లాక్ డౌన్ విధించకూడదనే నిబంధనను కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంగతి విదితమే.

Also Read: 

‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!

ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!

”టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..

IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్‌లు.. ఎప్పుడంటే..

సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.!