అన్‌లాక్ 3.0.. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు పూర్తిగా తొలగింపు..
ఈ నెల 31తో అన్‌లాక్ 2.0 ముగుస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను జారీ చేసింది.

Unlock 3.0: ఈ నెల 31తో అన్‌లాక్ 2.0 ముగుస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఆగష్టు 31 వరకు కఠినమైన లాక్ డౌన్ కొనసాగనుంది. ఇదిలా ఉంటే అంతర్రాష్ట్ర ప్రయాణాలు, గూడ్స్ రవాణాపై కేంద్రం ఆంక్షలను పూర్తిగా తొలగించింది.
గతంలో అంతర్రాష్ట్ర రవాణాపై ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధించుకోవచ్చునని.. అంతేకాకుండా నిబంధనలు విధించే క్రమంలో విస్తృతంగా పబ్లిసిటీ ఇవ్వాలని తెలిపింది. అయితే ఇప్పుడు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు, గూడ్స్ రవాణాకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఆగష్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్‌లను తెరుచుకునేందుకు అనుమతించిన కేంద్రం.. నైట్ కర్ఫ్యూపై ఆంక్షలను ఎత్తివేసింది.
Also Read:
అరగంటలో పేషెంట్ అడ్మిట్ కావాలి.. సీఎం జగన్ సీరియస్ వార్నింగ్..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్లు
