డిసెంబర్ నుంచి ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసులుః పాపిరెడ్డి

డిసెంబర్ నుంచి ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసులుః పాపిరెడ్డి

కరోనా ప్రభావంతో విద్యాసంస్థ తాళాలకే పరిమితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆన్ లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇవ్వడంతో అయా విద్యాసంస్థలు తిరిగి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.

Balaraju Goud

|

Nov 11, 2020 | 6:39 PM

కరోనా ప్రభావంతో విద్యాసంస్థ తాళాలకే పరిమితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆన్ లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇవ్వడంతో అయా విద్యాసంస్థలు తిరిగి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కాలేజీలు, యూనివర్సిటీల రీఓపెన్ కోసం యూజీసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేయడంతో విశ్వవిద్యాలయాలను పునః ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా దీపావళి తర్వాత విశ్వ విద్యాలయాలు పునఃప్రారంభిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. డిసెంబర్ నుంచి హైస్కూల్స్, ఇంటర్మీడియట్ వారికి ఫిజికల్ క్లాసులు నిర్వహించ వచ్చన్నారు. డిగ్రీ విద్యార్థులకు 30 శాతం సిలబస్ తగ్గిస్తామని వెల్లడించిన పాపిరెడ్డి… ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా సిలబస్ తగ్గించాలనుకుంటున్నామన్నారు. మార్చిలో టెన్త్ పరీక్షలు, ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఉండే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. కాగా, ఇటీవల నిర్వహించిన కౌన్సిలింగ్ ద్వారా ఇంజినీరింగ్ సీట్లు భర్తీ చేశామని, మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు మళ్లీ ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసులు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతాయని పాపిరెడ్డి ప్రకటించారు.అయితే, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని సూచించారు. అవసరమైతే షిప్టుల వారిగా క్లాసుల నిర్వహిస్తామన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu