కరోనా లాక్‌డౌన్ వేళ.. 10 లక్షల మందికి భోజనాలు..

కోవిద్-19 విజృంభణతో లాక్‌డౌన్ పొడిగించిన విషయం విదితమే. కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ పాటిస్తుండడంతో లక్షలాది మంది అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటివారి ఆకలితీరుస్తూ మానవత్వం

కరోనా లాక్‌డౌన్ వేళ.. 10 లక్షల మందికి భోజనాలు..
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2020 | 3:20 PM

కోవిద్-19 విజృంభణతో లాక్‌డౌన్ పొడిగించిన విషయం విదితమే. కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ పాటిస్తుండడంతో లక్షలాది మంది అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటివారి ఆకలితీరుస్తూ మానవత్వం చాటుకుంటోంది అమెరికాకు చెందిన ‘యునైటెడ్‌ సిక్స్’ స్వచ్ఛంద సంస్థ. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 10లక్షల మందికి పైగా భోజనాలు అందజేసినట్లు గురువారం ఆ సంస్థ వెల్లడించింది. అమెరికా, భారత్‌, యూకే, మలేసియా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో ఎంతో మందికి ఆకలి తీరుస్తున్నామని చెప్పింది.

మరోవైపు.. అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కాలిఫోర్నియా, వాషింగ్టన్‌, ఉటాహ్‌, మేరీల్యాండ్‌, న్యూయార్క్‌ రాష్ట్రాల్లోనూ తమ సంస్థ ఆహారం అందజేస్తోందని పేర్కొంది. కరోనా వైరస్‌ అధికంగా ఉన్న సియాటెల్‌లో వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించి స్థానికులకు కరోనా పరీక్షలు జరుపుతున్నామని చెప్పింది. అలాగే హ్యూస్టన్‌, టెక్సాస్‌లోనూ ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందజేస్తున్నట్లు తెలిపింది. కెనడాలో ఆహార కేంద్రాలు ఏర్పాటు చేశామని, అవసరమైన వారికి నిత్యావరసరాలను అందజేస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది.