AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AA20: బన్నీ ‘పుష్ప’.. విజయ్‌ సేతుపతి స్థానంలో ఆ నటుడు..!

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కబోతున్న అల్లు అర్జున్ పుష్ప గురించి మరో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో డేట్లు అడ్జెస్ట్ అవ్వకపోవడంతో..

AA20: బన్నీ 'పుష్ప'.. విజయ్‌ సేతుపతి స్థానంలో ఆ నటుడు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 17, 2020 | 3:41 PM

Share

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కబోతున్న అల్లు అర్జున్ పుష్ప గురించి మరో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో డేట్లు అడ్జెస్ట్ అవ్వకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ నుంచి కోలీవుడ్ నటుడు విజయ్‌ సేతుపతి బయటకు వెళ్లినట్లు ఈ మధ్యన వార్తలు వచ్చాయి. ఇక ఈ పాత్రలో కన్నడ నటుడు ధనుంజయ్ నటించబోతున్నట్లు సమాచారం.

‘భైరవ గీత’ సినిమా ద్వారా ధనుంజయ్‌ ఇదివరకే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ నటుడు కన్నడలో బిజీగా ఉండగా.. పుష్పలో కీలక పాత్ర కోసం అతడిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఈ పాత్రకు ధనుంజయ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్‌. కాగా ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని తీసుకోవాలనుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. జగపతిబాబు, ప్రకాష్ రాజ్‌, హరీష్‌ ఉత్తమన్‌, వెన్నెల కిశోర్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఐదు భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బన్నీ, సుకుమార్ కాంబోలో మూడో చిత్రంగా తెరకెక్కబోతోన్న పుష్పపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: పవన్‌తో రెండోసారి.. హిట్ కాంబో రిపీట్ అవ్వబోతోందా..!

Follow Us
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు