House Construction: సిమెంట్, కాంక్రీట్ మధ్య తేడాలేంటి..? చాలామందికి తెలియని విషయమిదే..
సిమెంట్, కాంక్రీట్ ఒక్కటేనా..? ఈ రెండింటి మధ్య తేడాలేంటి? అనేది చాలామందికి తెలియదు. ఈ రెండు ఒక్కటేనని చాలామంది అనుకుంటారు. కానీ రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి. ఇంటి నిర్మాణంలో ఈ రెండు కీలకమైనప్పటికీ.. వినియోగంలో మధ్య చాలా తేడాలున్నాయి. అవేంటి అనేది చూద్దాం.

మంచి ఇల్లు నిర్మించుకోవడం అనేది ప్రతీఒక్కరి కల. ఇందుకోసం కాయాకష్టం చేసి కూడబెట్టుకున్న సొమ్ము మొత్తం ఖర్చు చేస్తుంటారు. అయితే ఇంటి నిర్మాణంలో ఏమైనా మార్పులు కావాలంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ నిర్మాణానికి ఉపయోగించే సామాగ్రిలో ఎలాంటి మార్పులు ఉండవు. నాణ్యమైన సామాగ్రి అనేవి భవనం నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇంటి నిర్మాణానికి అవసరయ్యే ప్రధాన వస్తువుల్లో సిమెంట్, కాంక్రీట్ రెండూ ఉంటాయి.ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. అసలు సిమెంట్, కాంక్రీట్ మధ్య తేడాలేంటి..? ఈ రెండూ ఒక్కటేనా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సిమెంట్, కాంక్రీట్ మధ్య తేడాలేంటి..?
సిమెంట్ అనేది బంధన పదార్థం. సుద్దలాంటి, పెళుసైన పదార్థంగా చెప్పవచ్చు. అయితే కాంక్రీట్ విషయానికొస్తే.. సిమెంట్‌తో పాటు ఇతర వస్తువులు కలగలిపిన పదార్థం. సిమెంట్, సున్నపురాయి, బంక మట్టిని అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడం ద్వారా తెల్లటి లేదా బూడిద రంగు పొడి ఏర్పడుతుంది. ఈ పోడిని వాటర్, ఇసుక, కంకరతో కలపడం ద్వారా కాంక్రీట్‌గా మారుతుంది. కాంక్రీట్ వాడటం వల్ల ఇల్లు ధృఢంగా ఉంటుంది. సిమెంట్‌ను ఎక్కువగా ఇటుకలు, రాళ్లు, టైల్స్ వేసేందుకు ఉపయోగిస్తే.. ఇంటి పునాదులు, గోడలు, స్తంభాలు, అంతస్తులకు కాంక్రీట్‌ను ఉపయోగిస్తారు. ఇదేకాక రోడ్లు, కాలిబాటల నిర్మాణంలో కూడా కాంక్రీట్ ఎక్కువగా వాడతారు. కాంక్రీట్ అనేది నిర్మాణానికి పటిష్టమైన పునాది, ధృఢాన్ని అందిస్తుంది. సిమెంట్‌తో పోలిస్తే కాంక్రీట్ అనేది ధృఢంగా ఉంటుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సిమెంట్ నాణ్యత దెబ్బతింటుంది. సిమెంట్ వాడితే తరచుగా మరమ్మత్తులు అవసరమవుతుంది. అదే కాంక్రీట్ పర్యావరణ పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. ఏళ్ల పాటు మన్నికతో ఉండటం వల్ల తరచుగా మరమ్మత్తులు కూడా అవసరం ఉండదు. దీంతో సిమెంట్, కాంక్రీట్ ఒకేలా కనిపించినప్పటికీ.. ఈ రెంటింటి మధ్య అనేక వ్యత్యాసం ఉంది.
కాంక్రీట్ వల్ల ఉపయోగాలు..?
కాగా సిమెంట్ అత్యంత ఎక్కువ శక్తిని వినియోగించే పదార్థాలలో ఒకటిగా చెప్పవచ్చు. అయితే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ విడుదలకు ఇది ప్రధాన కారణాల్లో ఒకటి. పాత కాంక్రీట్ నిర్మాణాలను కూల్చివేయడం ద్వారా రీసైకిల్డ్ కాంక్రీట్ అగ్రిగేట్‌ను ఉపయోగించి కాంక్రీట్‌ను తయారు చేయవచ్చు. భవిష్యత్తులో సిమెంట్ ఉత్పత్తికి సంబంధించిన మార్గ ప్రణాళిక కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించే దిశగా సాగుతున్నప్పటికీ.. కాంక్రీట్ మరింత సుస్థిరమైన ఎంపికగా నిరూపించబడుతోంది. నిర్మాణ రంగంలో సిమెంట్, కాంక్రీట్‌లను చాలా దగ్గరగా ఉపయోగించడం వల్ల ఒక్కటేనని అందరూ అనుకుంటారు. కానీ రెండింటి మధ్య చాలా తేడాలు ఉంటాయి. ఇళ్ళు, రోడ్లు, వంతెనల వంటి ప్రతిదాన్ని నిర్మించడానికి అవసరమైన బలం, నిర్మాణాన్ని కాంక్రీట్ అందిస్తుంది.
