టోల్‌గేట్ల వద్ద వెహికల్స్ ఆగాల్సిన అవసరం లేదట.. రెండేళ్లలో టోల్‌ఫ్రీ దేశంగా మారుతుందన్న గడ్కరీ

|

Dec 18, 2020 | 1:00 PM

ఇటీవ‌ల ఫాస్ట్‌ట్యాగ్‌ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం తాజాగా జీపీఎస్ వ్వ‌వ‌స్థ‌ను తీసుకొచ్చి మొత్తం టోల్ గేట్ల‌నే తీసేయాల‌ని నిర్ణ‌యించింది.

టోల్‌గేట్ల వద్ద వెహికల్స్ ఆగాల్సిన అవసరం లేదట..  రెండేళ్లలో టోల్‌ఫ్రీ దేశంగా మారుతుందన్న గడ్కరీ
Follow us on

జాతీయ రహదారులపై ప్ర‌యాణించేట‌ప్పుడు టోల్ గేట్‌లు వ‌స్తున్నాయంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాము. టోల్ గేట్ వ‌ద్ద ఆగి టోల్ ఛార్జీలు చెల్లించ‌డం మ‌న స‌మ‌యాన్ని వృథా చేస్తుంది. ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉంటే టోల్ గేట్ల వ‌ద్ద కొన్నిసార్లు గంట తరబడి నిరీక్షణ తప్పదు. ఇందుకు ప‌రిష్కార మార్గంగా ఇటీవ‌ల ఫాస్ట్‌ట్యాగ్‌ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం తాజాగా జీపీఎస్ వ్వ‌వ‌స్థ‌ను తీసుకొచ్చి మొత్తం టోల్ గేట్ల‌నే తీసేయాల‌ని నిర్ణ‌యించింది. ఫాస్ట్‌ట్యాగ్ ఉంటే మ‌నం టోల్ గేట్ల వ‌ద్ద ఆగాల్సిన అవ‌స‌రం ఉండదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

దీనివల్ల టోల్‌గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా సాగిపోవచ్చని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వచ్చే రెండేళ్లలో భారత్‌ టోల్‌ఫ్రీ దేశంగా మారుతుందని ఆయన తెలిపారు. ‘అసోచాం ఫౌండేషన్‌ వీక్‌’ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ‘‘జీపీఎస్‌ ఆధారంగా… వాహనాల రాకపోకలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థ రానుందని తెలిపారు. ఇప్పుడు అన్ని వాణిజ్య వాహనాలూ వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టంతో వస్తున్నందున వాటికి ఎలాంటి సమస్య ఉండదని వెల్లడించారు. పాత వాహనాల్లో జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని.. వచ్చే మార్చి నాటికి దేశంలో టోల్‌ వసూళ్లు రూ.34 వేల కోట్లకు చేరుతాయని అంచనా వేస్తున్నామని మంత్రి వివరించారు. అన్ని టోల్‌ వసూళ్లకు జీపీఎస్‌ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల వచ్చే ఐదేళ్లలో టోల్‌ ఆదాయం రూ.1.34 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.

కొత్త విధానం అమ‌లులోకి వ‌స్తే అన్ని వాహ‌నాల‌కు జీపీఎస్‌ను అమ‌ర్చుకోవాల్సి ఉంటుంది. మ‌న వాహ‌నాలు ఎక్క‌డ తిరుగుతున్నాయ‌నే మొత్తం స‌మాచారం న‌మోద‌వుతుంది. జీపీఎస్ ఆధారంగా టోల్ రోడ్‌ల‌ను వినియోగించుకున్న వాహ‌న‌దారుల నుంచి నేరుగా టోల్ ఛార్జీలుగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో వ‌సూలు చేస్తారు. ఇందుకు గానూ బ్యాంక్ అకౌంట్‌ల‌ను వాహ‌నాల‌కు అనుసంధానం చేయనున్నారు.