వీధి వ్యాపారులు స్వనిధి రుణాలు : మంత్రి కిషన్‌రెడ్డి
వీధి వ్యాపారులు స్వనిధి పథకం కింద అందించే రుణ సదుపాయాన్ని సద్వినియోగపరుచుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకంపై సమీక్ష నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.
వీధి వ్యాపారులు స్వనిధి పథకం కింద అందించే రుణ సదుపాయాన్ని సద్వినియోగపరుచుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకంపై సమీక్ష నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. అలాగే, తెలంగాణలో పత్తి సీజన్ అక్టోబర్ నుండి ప్రారంభం కాబోతున్నందున మార్క్‌ఫెడ్, సీసీఐ అధికారులతో చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. వీధి వ్యాపారులు స్వనిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో రెండు లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని అధికారులను అదేశించామని ఆయన వెల్లడించారు.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆవాస్ యోజన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా చేపట్టాలన్న మంత్రి.. ఆవాస్ యోజన రుణం అందరూ ఉపయోగించుకోవాలన్నారు. 165 వెల్ నెస్ సెంటర్లను, బస్తీ దవాఖానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, కొన్ని ఇప్పటికే ప్రారంభం అయ్యాయన్నారు. ప్రజా వైద్య సదుపాయానికి కేంద్రం నిధులు ఇస్తుందని, అసవరమై మరిన్ని బస్తీ దవఖానాలు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పామని తెలిపారు.
ఈ ఏడాది పత్తి బాగా పండిందని, సీసీఐ మూడు కేంద్రాలుగా పనిచేస్తుందన్నారు. తెలంగాణలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని సూచించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రత్తికి రూ.5,280 మద్దతు ధర అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని కిషన్‌రెడ్డి తెలిపారు.