AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2026: అసలు కేంద్ర బడ్జెట్‌ను ఎలా తయారు చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Budget 2026: కేంద్ర వార్షిక బడ్జెట్‌ తయారీ అంతా సులభం కాదు. ఎన్నో సమావేశాలు.. ఎన్నో కసరత్తులు.. ఎన్నో లెక్కలు.. ఇలా ఒక్కటేమిటి బడ్జెట్‌కు గత ఐదారు నెలల ముందు నుంచి బడ్జె్‌ట్‌పై కసరత్తు జరుగుతుంది. మరి మొత్తం వార్షిక బడ్జెట్‌ను కేంద్రం ఎలా తయారు చేస్తుందో వివరంగా తెలుసుకుందాం..

Budget 2026: అసలు కేంద్ర బడ్జెట్‌ను ఎలా తయారు చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Budget
Subhash Goud
|

Updated on: Jan 27, 2026 | 11:38 AM

Share

Union Budget 2026: బడ్జెట్‌ అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు. కానీ ఈ మూడక్షరాల వెనుక చాలా శ్రమ దాగివుంటుంది. ఎంతో కసరత్తు..లెక్కకు మించి భేటీలు.. ఎంతో ర‌హ‌స్యం.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. మ‌రీ ఇంత బ‌డ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఎలా త‌యారు చేస్తుంది. ఎలా లెక్కలేస్తారు.. ఏ వ‌ర్గానికి ఎంత బ‌డ్జెట్ కేటాయిస్తార‌ని చాలా మందికి వ‌చ్చే అనుమానం. ఆ అనుమాన‌మేంటో తేల్చేద్దాం..!

సెప్టెంబ‌ర్ నెల‌లో..

రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు ప్రారంభ‌మ‌వుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాదికి ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది.

అక్టోబ‌ర్‌లో..

తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చలు జ‌రుగుతాయి. ఏ శాఖ‌లో ఏ రంగానికి ఎంత నిధులు కేటాయించాల‌నే దానిపై తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డిసెంబర్‌లో..

ముసాయిదా బడ్జెట్‌ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి.

జనవరి..

పారిశ్రామిక, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ఎలాంటి స‌మ‌స్యలు ఉన్నాయో వివ‌రిస్తారు.

ఫోన్‌ ట్యాపింగ్‌:

బడ్జెట్‌ ప్రతిపాదనలు ఏమాత్రం బ‌య‌ట‌కు లీక్‌ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్‌ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్‌ చేస్తుంటుంది. బ‌డ్జెట్ ప్రతిపాన‌ల‌పై గ‌ట్టి నిఘా ఉంటుంది.

ముద్రణ ప్రక్రియ:

బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు. ప‌క‌డ్బంధీ నిఘా ఉంటుంది.

సీసీటీవీల ద్వారా ఎప్పటిక‌ప్పుడు నిఘా..

ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు.

ఎవ‌రితో సంబంధం లేకుండా..

బడ్జెట్‌ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్‌ ప్రెస్‌’ సిబ్బందికి ఎవరితో సంబంధం లేకుండా నిఘా ఉంటుంది. అయితే ఈ బడ్జెట్‌ పత్రాల ప్రింటింగ్‌ అనేది కోవిడ్‌కు ముందు జరిగేది. తర్వాత ఎలాంటి ప్రింటింగ్‌ లేకుండా డిజిటల్‌గానే ఉంచుతున్నారు. అవసరమైన కాపీలను మాత్రమే ముద్రిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రింటింగ్‌లోగానీ, బడ్జెట్‌లో తయారీలో నిమగ్నమైన ఉన్నవారికి గానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. అక్కడున్న సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్ని అయినా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు. అయితే బడ్జెట్‌ ప్రతులను అధికారి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. దీనిని ఎవరైనా చదువుకోవచ్చు. అది కూడా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

నీడలా వెన్నంటే..

బడ్జెట్‌ తయారీలో గానీ, ప్రింటింగ్‌లో విభాగంలో గానీ పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. అత్యవస‌రం అయితే త‌ప్పా బ‌య‌ట‌కు ఎవ్వరిని పంపించ‌రు. సిబ్బందిపై ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచుతారు.

బ‌డ్జెట ప్రవేశ‌పెట్టే రోజు

బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టే రోజు ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్‌ గురించి పూర్తిగా వివరిస్తారు.

1950లో బడ్జెట్‌ లీక్ కావ‌డంతో..

పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్‌ పేపర్లు కూడా లీకైన సంఘటనలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌ లీక్‌సంఘటన1950లో చోటుచేసుకుంది. అప్పట్లో బడ్జెట్‌ పత్రాల్ని రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. 1950లో ఈ పత్రాలు లీక్‌ కావడంతో అప్పటి నుంచి మింట్‌రోడ్‌లోని సెక్యూరిటీ ప్రెస్‌కు వేదికను మార్చారు. 1980 నుంచి ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో బడ్జెట్‌ పత్రాల్ని ముద్రిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు డిజిటల్‌గా చేశారు గానీ ప్రింటింగ్‌ చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు డిజిటల్‌గా ఉన్నప్పటికీ జాగ్రత్తల్లో మాత్రం ఏ మాత్రం తేడా లేదు. గట్టి నిఘా నీడలో ఈ బడ్జెట్‌ తయారు అవుతుందనే చెప్పాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి