AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అస్సాం ఎన్నార్సీ… మోదీ సెకండ్ స్ట్రాటజీ

అస్సాంలో 19 లక్షల మంది పేర్లను నేషనల్ సిటిజన్స్ లిస్ట్ (ఎన్ ఆర్ సీ ) లో తొలగించారు. లీగల్ గా ఈ రాష్ట్రంలో ఉంటున్నవారెందరు..? అక్రమంగా ఉంటున్నవారెందరు అన్న భారీ కసరత్తులో భాగంగా జరిగిన ప్రక్రియ ఇది.. సిటిజన్స్ లిస్ట్ లో 3. 11 కోట్ల మంది పేర్లను చేర్చారు. 1951 తరువాత దేశంలో ప్రచురితమైన అతి పెద్ద రెండో (జనాభా) జాబితా ఇది.. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని […]

అస్సాం ఎన్నార్సీ... మోదీ సెకండ్ స్ట్రాటజీ
Pardhasaradhi Peri
|

Updated on: Aug 31, 2019 | 1:42 PM

Share

అస్సాంలో 19 లక్షల మంది పేర్లను నేషనల్ సిటిజన్స్ లిస్ట్ (ఎన్ ఆర్ సీ ) లో తొలగించారు. లీగల్ గా ఈ రాష్ట్రంలో ఉంటున్నవారెందరు..? అక్రమంగా ఉంటున్నవారెందరు అన్న భారీ కసరత్తులో భాగంగా జరిగిన ప్రక్రియ ఇది.. సిటిజన్స్ లిస్ట్ లో 3. 11 కోట్ల మంది పేర్లను చేర్చారు. 1951 తరువాత దేశంలో ప్రచురితమైన అతి పెద్ద రెండో (జనాభా) జాబితా ఇది.. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసిన అనంతరం మోదీ ప్రభుత్వం చేబట్టిన అత్యంత ప్రధానమైన, రెండో వ్యూహమిది. లీగల్ చిక్కులు అన్నీ పరిష్కారమయ్యేవరకు ఫైనల్ జాబితాలో చేర్చని వారిని విదేశీయులుగా పరిగణించజాలమని ప్రభుత్వం తెలిపింది. ఈ జాబితాలో తమ పేరు లేని ఎవరైనా ఫారినర్స్ ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చునని, ఇందుకు కాల పరిమితిని 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచామని అధికారులు స్పష్టం చేశారు. తమ పేర్లు లిస్టులో ఉన్నాయో., లేదో తెలుసుకునేందుకు, స్టేటస్ ఆరాకు ఎన్ ఆర్ సి వెబ్ సైట్ లో చూసుకోవచ్ఛునని అంటున్నారు. అయితే జాబితా ప్రచురితమయ్యాక సైట్ క్రాష్ అయింది. ప్రజలు ఈ స్టేటస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేవా కేంద్రాల నుంచి, లేదా డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాలనుంచి తెలుసుకోవచ్ఛునంటున్నారు. తాజాగా జాబితా రిలీజ్ చేసిన నేపథ్యంలో.. అస్సాం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీ ఎత్తున పోలీసు, పారా మిలిటరీ బలగాలను మోహరించారు. గత జులైలో ప్రచురితమైన ముసాయిదా లో సుమారు 41 లక్షల మంది పేర్లను తొలగించారు. తాము స్థానికులమేనని నిరూపించే ఆధారాలతో రావాలని వారిని కోరారు. ఇక వివాదాలను ఆలకించేందుకు కనీసం వెయ్యి ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేస్తామని హోం శాఖ ప్రకటించింది. ఇప్పటికే 100 ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయి. వచ్ఛే నెలలో మరో 200 ట్రిబ్యునల్స్ ఏర్పాటు కానున్నాయి. ట్రిబ్యునల్ లో ఎవరి కేసు అయినా ఓడిపోతే.. వారు హైకోర్టును, ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. లీగల్ మార్గాలన్నీ ‘మూసుకుపోయేంతవరకు’ ఎవరినీ నిర్బంధ శిబిరాల్లో ఉంచబోరు. పెద్ద సంఖ్యలో బెంగాలీ హిందువులను జాబితా నుంచి మినహాయించారని పలువురు బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం సర్బానంద సోనోవాల్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి.. విదేశీయుల తొలగింపునకు అనువుగా చట్టం తెచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరారు. 1951 నాటి మొదటి జాబితాను అప్ డేట్ చేసి రెండో లిస్టును రూపొందించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా ప్రభుత్వం ఈ జాబితా విడుదల చేసింది.