AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్‌ నుంచి తప్పుకున్న పాక్‌ పేసర్‌ ఉమర్‌ గుల్‌

పాకిస్తాన్‌ పేస్‌ బౌలర్‌ ఉమర్‌ గుల్‌ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.. అన్ని ఫార్మట్ల క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్టు ప్రకటించాడు.. నేషనల్ టీ-20 కప్‌లో ఉమర్‌గుల్‌ బలూచిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.. నిన్న రాత్రి సౌతర్న్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత ఉమర్‌ గుల్‌ ఈ నిర్ణయాన్ని తెలిపాడు.. ఈ మ్యాచ్‌లో బలూచిస్తాన్‌ పరాజయం పాలైంది.. అంతే కాకుండా టోర్నీ నుంచి కూడా తప్పుకుంది.. మరోవైపు సౌతర్న్‌ పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందింది.. ఇది కూడా ఉమర్‌గుల్‌ను […]

క్రికెట్‌ నుంచి తప్పుకున్న పాక్‌ పేసర్‌ ఉమర్‌ గుల్‌
Balu
|

Updated on: Oct 17, 2020 | 10:50 AM

Share

పాకిస్తాన్‌ పేస్‌ బౌలర్‌ ఉమర్‌ గుల్‌ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.. అన్ని ఫార్మట్ల క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్టు ప్రకటించాడు.. నేషనల్ టీ-20 కప్‌లో ఉమర్‌గుల్‌ బలూచిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.. నిన్న రాత్రి సౌతర్న్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ తర్వాత ఉమర్‌ గుల్‌ ఈ నిర్ణయాన్ని తెలిపాడు.. ఈ మ్యాచ్‌లో బలూచిస్తాన్‌ పరాజయం పాలైంది.. అంతే కాకుండా టోర్నీ నుంచి కూడా తప్పుకుంది.. మరోవైపు సౌతర్న్‌ పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందింది.. ఇది కూడా ఉమర్‌గుల్‌ను బాధించినట్టు ఉంది.. రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌లో కొనసాగిన ఉమర్‌గుల్‌ పాకిస్తాన్‌కు కొన్ని మరపురాని విజయాలను అందించాడు. 20 ఏళ్ల పాటు తనకు మద్దతుగా నిలిచిన ఆదరించిన ప్రతి ఒక్కరికి ఉమర్‌గుల్‌ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.. తనకు క్రికెట్‌ జీవితంలో ఎలా పోరాడాలో చెప్పిందన్నాడు.. దాంతో పాటు విలువలను కూడా నేర్పిందన్నాడు. క్రికెట్‌ జీవితాన్ని బాగా ఎంజాయ్‌ చేశానని చెప్పిన గుల్‌ కెరీర్‌ ఎదుగుదలకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్‌ నుంచి వైదొలగడమన్నది కష్టంగానే ఉన్నా తప్పని పరిస్థితి అని చెప్పాడు..తనకు పేరు ప్రఖ్యాతను తెచ్చిపెట్టిన క్రికెట్‌ను, తన దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పాటుపడతానని అన్నాడు .. 2002లో జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన ఉమర్‌గుల్‌ ఆ మరుసటి ఏడాదే సీనియర్‌ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.. 2004లో భారత్‌తో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్లు తీసుకున్నాడు.. జట్టు విజయంలో ముఖ్య భూమికను పోషించాడు.

Follow Us
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?
క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది అప్పుడేనా..?
కరువు మండలాలు ప్రకటించారు.. రైతులకు సాయం దక్కేది అప్పుడేనా..?
రన్ అవుట్ వివాదంపై మౌనం వీడిన తిలక్ వర్మ
రన్ అవుట్ వివాదంపై మౌనం వీడిన తిలక్ వర్మ
చదువుకు, ఉద్యోగానికి మధ్య పెరుగుతున్న అంతరం.. వాస్తవ కారణాలివే!
చదువుకు, ఉద్యోగానికి మధ్య పెరుగుతున్న అంతరం.. వాస్తవ కారణాలివే!
మార్కెట్లు పడుతున్నా తగ్గని SIP పెట్టుబడులు.. సరికొత్త రికార్డు!
మార్కెట్లు పడుతున్నా తగ్గని SIP పెట్టుబడులు.. సరికొత్త రికార్డు!
హార్వర్డ్‌లో చదవాలన్నది ఆమె కల.. లైబా మృతి!
హార్వర్డ్‌లో చదవాలన్నది ఆమె కల.. లైబా మృతి!
ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో నయా క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో నయా క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది