బ్రిటన్‌లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. తొలి డోసు వేయించుకున్న బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్ దంపతులు

బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్, ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌కు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఇచ్చారు వైద్యులు.

బ్రిటన్‌లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. తొలి డోసు వేయించుకున్న బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్ దంపతులు
Follow us

|

Updated on: Jan 11, 2021 | 5:55 AM

కరోనా రాకాసి కోరల నుంచి జనం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. వ్యాక్సిన రాకతో అంతా ఉపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. తాజాగా బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్, ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌కు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఇచ్చారు వైద్యులు. విండ్సర్‌ కేజల్‌లో ఉంటున్న రాణి దంపతులకు ఫ్యామిలీ డాక్టర్‌ శనివారం నాడు కరోనా టీకా మొదటి డోసు అందించ్చినట్టుగా బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వర్గాలు వెల్లడించాయి. రాణి, రాజు వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను బయట ప్రపంచానికి వెల్లడించడం చాలా అరుదుగా జరుగుతుంది.

కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌తో వణికిపోతున్న బ్రిటన్‌లో ఇప్పటివరకు 15 లక్షల మందికి కరోనా టీకా మొదటి డోసును అందజేశారు. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ వ్యాక్సిన్, ఆక్స్‌ఫర్డ్‌– ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లు ప్రస్తుతం బ్రిటన్‌లో ఇస్తున్నారు. ఎలాంటి ఊహాగానాలకు తావుండ కూడదని తామిద్దరం వ్యాక్సిన్‌ వేయించుకునట్టుగా మహారాణియే స్వయంగా ప్రజలందరికీ వెల్లడించమన్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఎలిజెబెత్‌ వయసు 94 కాగా, ఫిలిప్‌ వయసు 99 సంవత్సరాలు. బ్రిటన్‌లో 80 ఏళ్లు పైబడిన వారికి తొలి ప్రాధాన్యంగా టీకా ఇస్తున్నారు. అయితే రాణి దంపతులకి ఏ కంపెనీ వ్యాక్సిన్‌ ఇచ్చారన్న దానిపై స్పష్టత రావల్సి ఉంది.

భారత్‌లో వెలుగుచూస్తున్న కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్.. యూకే నుంచి వచ్చిన నలుగురికి పాజిటివ్..

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?