భారత్‌లో వెలుగుచూస్తున్న కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్.. యూకే నుంచి వచ్చిన నలుగురికి పాజిటివ్..

యూకే నుంచి భారత్‌కు వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు.

భారత్‌లో వెలుగుచూస్తున్న కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్..  యూకే నుంచి వచ్చిన నలుగురికి పాజిటివ్..
Follow us

|

Updated on: Jan 11, 2021 | 5:38 AM

Corona virus New Strain: కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. మరో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త వైరస్ భారత్‌లోకి మెల్లమెల్లగా పాకుతోంది. తాజాగా యూకే నుంచి భారత్‌కు వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. ఆదివారం లండన్ నుంచి బెంగళూరుకు వచ్చిన 273 మంది ప్రయాణికులను అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలినట్టు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే. సుధాకర్ తెలిపారు.

కొత్త కరోనా స్ట్రెయిన్ దేశాన్ని భయపెడుతుండటంతో నలుగురు ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతం వీరందరిని ఎయిర్ పోర్టు సమీపంలోకి క్వారంటైన్ సెంటర్లకు తరలించినట్లు మంత్రి సుధాకర్ చెప్పారు. కాగా.. యూకేలో కొత్త కరోనా స్ట్రెయిన్ కారణంగా భారత ప్రభుత్వం యూకేకు రాకపోకలను నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆంక్షలను ఎత్తివేసిన తరువాత యూకే నుంచి మొదటి విమానం బెంగళూరులోని కెంపెగౌడ్ ఎయిర్‌పోర్టుకు ఆదివారం ఉదయం చేరుకుంది. దీంతో వారందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది ప్రభుత్వం.

ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలుపై చర్చ