బ్రిటన్ కరోనావైరస్ మరీ అంత ప్రమాదకరమైనది కాదట, ఇండో-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి విశ్లేషణ , వేచి చూడాలని వ్యాఖ్య

బ్రిటన్ లో వ్యాప్తి చెందుతున్న కొత్త కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని చెప్పలేమని అమెరికాలోని ఇండియన్-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి అన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 7:29 am, Tue, 22 December 20
బ్రిటన్ కరోనావైరస్ మరీ అంత ప్రమాదకరమైనది కాదట, ఇండో-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి విశ్లేషణ , వేచి చూడాలని వ్యాఖ్య

బ్రిటన్ లో వ్యాప్తి చెందుతున్న కొత్త కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని చెప్పలేమని అమెరికాలోని ఇండియన్-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి అన్నారు. ఇప్పటికే డెవలప్ అయిన వ్యాక్సిన్లు ఈ కొత్త స్ట్రెయిన్ కి అంత ఎఫెక్టివ్ కాకపోవచ్చునన్నారు. బ్రిటన్ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, అత్యంత ఇన్ఫెక్షన్ తో కూడినదని అంటున్నారని ఆయన చెప్పారు. కానీ ఇందుకు ఆధారాలు కనిపించడం లేదన్నారు. మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.  రీసెర్చ్ మరింత జరగాలని, ఈ కొత్త వైరస్ మూలాలు కనుగొనాల్సిన అవసరం ఉందని వివేక్ మూర్తి వ్యాఖ్యానించారు. బ్రిటన్ కరోనా వైరస్ పై అనేక దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ అమెరికా మాత్రం దీనిపై పెద్దగా స్పందించకపోవడం విశేషం. పైగా పలు దేశాలు విమాన రాకపోకలను నిలిపివేసినా అమెరికా ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్..తమ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్  బృందం డైరెక్టర్లలో ఒకరిగా డాక్టర్ వివేక్ మూర్తిని నియమించారు. ఈయన ప్రముఖ సర్జికల్ నిపుణుడు కూడా.. బ్రిటన్ వైరస్ మీద తాము దృష్టి పెడతామని ఈయన ప్రకటించారు.