UCIL Recruitment 2021: యురేనియం కార్పొరేషన్‌లో పలు విభాగాల్లో 47 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..?

|

Feb 25, 2021 | 9:14 PM

UCIL Recruitment 2021: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) 2021 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా..

UCIL Recruitment 2021: యురేనియం కార్పొరేషన్‌లో పలు విభాగాల్లో 47 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..?
Follow us on

UCIL Recruitment 2021: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) 2021 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్, చీఫ్ సూపరింటెండెంట్, చీఫ్ మేనేజర్, సూపర్‌వైజర్ , తదితర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించేందుకు చివరితేదీ 20 మార్చి 2021.

జార్ఖాండ్ ప్రాంతంలోని జాదుగుడ మైన్స్‌లో మొత్తం 47 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
ఈ పోస్టుల్లో డిజిఎం / చీఫ్ మేనేజర్ – మెడికల్ , చీఫ్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అకౌంట్స్ , స్టోర్ కంట్రోలర్, కంట్రోలర్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్, అసిస్టెంట్ మేనేజర్, సూపర్‌వైజర్ కెమికల్/సివిల్ , ఫోర్‌మాన్ మెకానికల్ తదితర పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి తదితర విభాగాలలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అనుభవం కూడా ఉండాల్సి ఉంటుంది.
వయస్సు: 30 ఏళ్ల నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు.. ఇతర అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు అనంతరం దరఖాస్తుదారులు తమ దరఖాస్తు పత్రాలను ఈ క్రింది చిరునామాకు పంపాలి..
జనరల్ మేనేజర్ (ఇన్‌స్ట్ / పర్. & ఐఆర్. / ప్రాజెక్ట్స్), యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పిఒ జాదుగుడ మైన్స్, జిల్లా సింగ్భూమ్ ఈస్ట్, జార్ఖండ్ – 832102.
(General Manager, Uranium Corporation of India Limited, Jaduguda Mines, Jharkhand-832102)

మరిన్ని వివరాల కోసం యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (http://www.ucil.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి..

 

Also Read:

కీబోర్డు టైప్ చేస్తుంటే కీళ్ల నొప్పి వేధింస్తుందా ? ఈ సింపుల్ హ్యాండ్ ఎక్సర్‏సైజ్ చేసి చూడండి..

మానసిక ఒత్తిడికి గురవుతున్నారా ? వీటిని రోజూవారీ డైట్‏లో తీసుకోవడం వలన ఆందోళన తగ్గిస్తాయి.. అవెంటంటే..

Workout Tips: వర్క్ అవుట్‏ను స్కిప్ చేస్తున్నారా ? అయితే ఈ సింపుల్ ట్రిక్స్‏తో ఫిట్‏నెస్‏ను పెంచుకోండిలా..