అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన యూఏఈ
అరబ్ దేశాల్లోనే తొలిసారి అణువిద్యుత్ కేంద్రాన్ని యూఏఈ ప్రారంభించింది. యూఏఈలో అణువిద్యుత్ కేంద్రాన్ని విజయవంతంగా ప్రారంభించినట్లు ఆ దేశ ప్రధాని మహమ్మద్ బిన్ రషిద్..

UAE starts nuclear reactor : అరబ్ దేశాల్లోనే తొలిసారి అణువిద్యుత్ కేంద్రాన్ని యూఏఈ ప్రారంభించింది. యూఏఈలో అణువిద్యుత్ కేంద్రాన్ని విజయవంతంగా ప్రారంభించినట్లు ఆ దేశ ప్రధాని మహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తుం వెల్లడించారు. దీంతో అరబ్ దేశాల్లోనే తొలి కమర్షియల్ అణువిద్యుత్ కేంద్రం కలిగిన దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చరిత్ర సృష్టించింది.
ఆ దేశ ప్రధాని మహమ్మద్ బిన్ రషిద్ మాట్లాడుతూ.. తమ దేశంలో తొలిసారిగా కమర్షియల్ అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించినందుకు ఆనందంగా ఉందన్నారు. నిపుణుల బృందం విజయవంతంగా అణు ఇంధనాన్ని ఇందులో ప్రవేశపెట్టి పరీక్షించిందని వెల్లడించారు. దీనికి బరాక్ స్టేషన్ అని పేరు పెట్టామని, ఈ కేంద్రం అబుదాబీలో ఉందని మక్తుం స్పష్టం చేశారు.