చీరాల యువకుడి మృతి కేసులో ఎస్ఐ అరెస్ట్
ప్రకాశం జిల్లా చీరాల టూ టౌన్ ఎస్‌ఐ విజయ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పటికే విజయ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది.

Chirala Kiran Death case : ప్రకాశం జిల్లా చీరాల టూ టౌన్ ఎస్‌ఐ విజయ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పటికే విజయ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా చీరాలలో ఎస్‌ఐను ఇంకొల్లు సీఐ రాంబాబు అరెస్ట్ చేశారు.
చీరాల థామస్‌పేటకు చెందిన వై.కిరణ్‌కుమార్ (26), ఆయన స్నేహితుడు వి.షైనీ అబ్రహం గత నెల 18వ తేదీన సాయంత్రం టూ వీలర్ పై కొత్తపేట నుంచి చీరాలకు వస్తున్నారు. అయితే మాస్క్ పెట్టుకోలేదని కొత్తపేట చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అక్కడ యువకులకు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న టూ టౌన్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో ఎస్‌ఐ తీవ్రంగా కొట్టడంతో తన కుమారుడి తలకు గాయం అయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని కిరణ్‌కుమార్ తండ్రి మోహన్‌రావు ఆరోపించారు. మెరుగైన వైద్యం కోసం కిరణ్‌ను గుంటూరు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. ఈ కేసు సీరియస్ అవ్వడంతో గుంటూరు అడిషనల్ ఎస్పీ గంగాధర్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. కాగా చనిపోయిన దళిత యువకుడి కుటుంబానికి సీఎం జగన్ రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : ఏపీలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు