గుడ్ న్యూస్ : ‘మై జీహెచ్‌ఎంసీ యాప్’తోనూ ఆస్తిపన్ను చెల్లింపులు
ఆస్తి పన్ను బకాయిదారులందరికీ తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. వన్‌టైం స్కీం(ఓటీఎస్) కింద బకాయిలు కడితే పలు ప్రయోజనాలు పొందే వెసులుబాటు కల్పించింది.

ఆస్తి పన్ను బకాయిదారులందరికీ తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. వన్‌టైం స్కీం(ఓటీఎస్) కింద బకాయిలు కడితే పలు ప్రయోజనాలు పొందే వెసులుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి ఓ జీవో కూడా జారీ చేసింది. జీవో 306 ప్రకారం 2019-20 సంవత్సరం వరకు బకాయి ఉన్న ఆస్తి పన్ను, వడ్డీపై విధించిన 10 శాతం చెల్లించడం ద్వారా 90 శాతం రాయితీ పొందొచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు.
ఈ పథకాన్ని ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్, వెబ్‌సైట్‌లో అప్‌గ్రేడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా ఇంటి నుంచే పేమెంట్స్ జరిపే వీలుంటుందని వివరించారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా ఈ సౌకర్యం ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. సిటిజన్ సర్వీస్ సెంటర్లు, మీసేవా కేంద్రాలతో పాటు బిల్ కలెక్టర్ల వద్ద చెల్లింపులు జరపవచ్చని తెలిపారు. దీని ద్వారా సిటీ పరిధిలో 5,41,010 మంది యజమానులకు ప్రయోజనం చేకూరనుందని కమిషనర్ వెల్లడించారు.
Read More : ఏపీలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల వివరాలు