దారుణం: బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. 24 మందికి గాయాలు
ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న బైక్‌ను ఢీ కొట్టి బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 26 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సు శ్రశైలం నుంచి 26 మంది ప్రయాణికులతో కడపకు బయలు దేరిందని.. దరిమడుగు సమీపంలోని మహ్మద్‌సాహెబ్ […]
ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న బైక్‌ను ఢీ కొట్టి బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 26 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సు శ్రశైలం నుంచి 26 మంది ప్రయాణికులతో కడపకు బయలు దేరిందని.. దరిమడుగు సమీపంలోని మహ్మద్‌సాహెబ్ కుంట వద్ద ముందు వెళ్తున్న బైక్‌ను బస్సు ఢీ కొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం అదుపుతప్పి కుంటలోకి బస్సు బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. బైక్‌పై వెళ్తున్న షేక్ అబ్దుల్ రహమాన్ అలియాస్ టింకు (32), షేక్ జిందాషాహిద్(19) అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు అబ్దుల్ రెహమాన్‌ది కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం మార్కాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. సీఐ కేవీ రాఘవేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను మార్కాపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ఎస్‌జే బాషాను అదుపులోకి తీసుకున్నారు.