హైదరాబాద్‌లో డేంజర్ క్రైమ్ అడ్డాలు ఇవే..! మహిళలూ.. బీ కేర్‌ఫుల్..!
క్రైమ్.. ఈ పదం వింటుంటేనే.. వణుకు పుడుతోంది. దొంగతాలు, హత్యలు కంటే.. అత్యాచారాలు ఆపై హత్యలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే.. పోలీసులు వీటిపై ఎన్ని రకాలుగా.. యాక్షన్స్ తీసుకొచ్చినా.. మృగాళ్ల మైండ్‌సెట్ మారడంలేదు. ఆ ఒక్క క్షణ సుఖం కోసం.. మహిళలను అతి దారుణంగా హతమార్చుతున్నారు. ముఖ్యంగా.. హైదరాబాద్ ‘క్రైమరాబాద్’గా మారుతోంది. కొద్దిగా చీకటైతే చాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుపోతోంది. ఇప్పటి ఘటనలను బట్టి చూస్తే.. అసలు పట్ట పగలే.. రోడ్డుపై ఆడపిల్లలు తిరగాలంటే.. భయపడిపోతున్నారు. కంటపడింది […]
క్రైమ్.. ఈ పదం వింటుంటేనే.. వణుకు పుడుతోంది. దొంగతాలు, హత్యలు కంటే.. అత్యాచారాలు ఆపై హత్యలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే.. పోలీసులు వీటిపై ఎన్ని రకాలుగా.. యాక్షన్స్ తీసుకొచ్చినా.. మృగాళ్ల మైండ్‌సెట్ మారడంలేదు. ఆ ఒక్క క్షణ సుఖం కోసం.. మహిళలను అతి దారుణంగా హతమార్చుతున్నారు. ముఖ్యంగా.. హైదరాబాద్ ‘క్రైమరాబాద్’గా మారుతోంది. కొద్దిగా చీకటైతే చాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుపోతోంది. ఇప్పటి ఘటనలను బట్టి చూస్తే.. అసలు పట్ట పగలే.. రోడ్డుపై ఆడపిల్లలు తిరగాలంటే.. భయపడిపోతున్నారు.
కంటపడింది ఆడవాళ్లయితే చాలు.. వయసుతో నిమిత్తం లేకుండా.. పసికూనల నుంచి వృద్ధుల దాకా మృగాళ్లు వెంటబడి వేటాడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫ్లైఓవర్స్ కింద, మెట్రో మలుపులు, రైల్వేస్టేషన్ పరిసరాలు, నివాస సముదాయాలకు కూత వేటు దూరాలు, ఎక్కడైతేనేం మనుషుల అలికిడి తగ్గితే చాలు అరాచక శక్తులు నిద్ర లేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట నేరాలు, దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా.. ఈ క్రింది ప్రాంతాలు క్రైమ్స్‌కి అడ్డాగా మారాయి. అవేంటో మీరు తెలుసుకోండి.
- పంజాగుట్ట: మీరెప్పుడైనా పంజాగుట్ట సమీపంలోని సాహెబ్ నగర్‌కు వెళ్లారా? అక్కడ హుడా లేఅవుట్‌లో అసాంఘీక పనులు రోజూ జరుగుతూనే ఉంటాయి. మద్యం, వ్యభిచారం సర్వసాధారణమైపోయింది.
- లింగోజిగూడ: డివిజన్ మూసీ పరివాహక ప్రాంతం కూడా అంతే దుష్టశక్తులకు నెలవుగా మారింది. ఇక లింగోజిగూడలోని అధికారినగర్, కామేశ్వర్‌రావు కాలనీ, అమ్మవారి టెంపుల్ ఏరియా, సరూర్‌నగర్ గాంధీ విగ్రహం ప్రాంతంలో రాత్రి వేళల్లో బయటకు వెళ్లే పరిస్థితి లేదు.
- కొత్తపేట: విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న కొత్తపేట చౌరస్తాలోని వీఎంహోమ్‌లో.. రాత్రిళ్లు మందుబాబులు తప్పతాగి చిందులేస్తుంటారు. ప్రహరి కూలిపోవడంతో వెనుక నుంచి గ్రౌండ్‌లోని చెట్ల మధ్య కుర్చుని తాగుతూ పేకాడుతుంటారు.
- జగద్గిరిగుట్ట: హెచ్‌ఎంటీ ప్రదేశం సుమారు 700 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఇందులో హత్యలు, దోపిడీలు, ఆత్యాచార సంఘటనలు అనేకం జరిగాయి. ఓవైపు జీడిమెట్ల, మరోవైపు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నప్పటికీ రాత్రిపూట ఇటు నుంచి ఒంటరిగా వెళ్లాలంటే సామాన్యులు సాహసించరు.
- కొంపల్లి: కొంపల్లి కేటీఆర్ పార్కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని జంటలు ప్రేమపేరుతో తిష్ట వేస్తున్నారు. వీరిని అనుసరించి వచ్చే అల్లరిమూకలు మిగతా యువతులు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతుంటారు. ఇక రాత్రి వేళల్లో ఈ ప్రాంతం వ్యభిచార కేంద్రంగా మారిపోతుంది.
- వెన్‌సాయి ఏరియా: నగరశివార్లలోని వెన్‌సాయి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్ ఖాళీగా ఉండడంతో రాత్రిళ్లు కొందరు మద్యం తాగి రెచ్చిపోతున్నారు. కార్టన్ల కొద్ది బీరు బాటిళ్లను తీసుకొచ్చి తాగాక వాటిని రోడ్ల మీదనే పగులగొడుతున్నారు. ఇలా నగరంలో అసాంఘీక అడ్డాలు ఎన్నో.. మరెన్నో ఉన్నాయి. పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మద్యం తాగి రోడ్లపై వెళ్లేవారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
- శంషాబాద్: శంషాబాద్ పరిసరప్రాంతాల్లో.. ఇటీవల కాలంలో.. సంఘవిద్రోహ శక్తుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. లారీ డ్రైవర్లు.. ఫుల్లుగా మందు కొట్టి దారంట వెళ్తున్న మహిళలపై అకృత్యాలకు తెగబడుతున్నారు. పోలీసులు కూడా.. చూసీ చూడనట్టు ఉదాసీనంగా వ్యవహరించడంతో.. వీరి ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. తాజాగా.. జరిగిన ప్రియాంకా రెడ్డి హత్యాచారమే ఇందుకు నిదర్శనం.